Telugu Global
NEWS

సీఎం ముఖ్యకార్యదర్శికి సీఎస్ నోటీస్

ఏపీలో అధికారుల మధ్య పొరపొచ్చాలు కాకరేపుతున్నాయి. ఏపీ సీఎం జగన్ కార్యదర్శి దుందుడుకు చర్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్ అయ్యారు.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీఎస్ అధికారాలనే బుట్టదాఖలు అయ్యేలా అర్హత లేకున్నా సర్వీస్ రూల్స్ మార్చేసిన జగన్ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటీసులు జారీ చేశారు. ఏపీలోని ఇద్దరు కీలక ఉన్నతాధికారుల మధ్య ఈ నోటీసుల వ్యవహారం ఏపీ […]

సీఎం ముఖ్యకార్యదర్శికి సీఎస్ నోటీస్
X

ఏపీలో అధికారుల మధ్య పొరపొచ్చాలు కాకరేపుతున్నాయి. ఏపీ సీఎం జగన్ కార్యదర్శి దుందుడుకు చర్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్ అయ్యారు.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సీఎస్ అధికారాలనే బుట్టదాఖలు అయ్యేలా అర్హత లేకున్నా సర్వీస్ రూల్స్ మార్చేసిన జగన్ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటీసులు జారీ చేశారు.

ఏపీలోని ఇద్దరు కీలక ఉన్నతాధికారుల మధ్య ఈ నోటీసుల వ్యవహారం ఏపీ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతటికి బాస్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే.. అర్హత లేకుండానే సర్వీస్ రూల్స్ ను సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మార్చేశారు. ఉత్తర్వులు జారీ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపింది.

మంత్రి మండలి ఆమోదం లేకుండా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేయాల్సిన సర్వీస్ రూల్స్ మార్పులను ప్రవీణ్ ప్రకాష్ జారీ చేయడం అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. నిబంధనలకు విరుద్దంగా జారీ చేసిన ఈ జీవో చెల్లదని అధికార వర్గాలు తెలిపాయి.

దీంతో ప్రవీణ్ ప్రకాష్ పై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరుతూ ప్రవీణ్ ప్రకాష్ కు నోటీసులు జారీ చేశారు.

ఇక సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి, సీఎస్ కు మధ్య తలెత్తిన ఈ వివాదంపై అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతోంది.

First Published:  3 Nov 2019 7:12 AM IST
Next Story