Telugu Global
National

ఈనాడు పత్రిక కథనాల వల్లే వాసవీ బ్యాంకు కుప్పకూలింది...

తప్పుడు కథనాలు రాస్తే మీడియాపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆయా శాఖ ముఖ్యకార్యదర్శులకు అధికారం అప్పగించడంపై ఈనాడు పత్రిక పెద్దెత్తున విమర్శలు చేస్తూ కథనాలు రాస్తున్న నేపథ్యంలో ఒక చానల్‌లో జరిగిన చర్చ కార్యక్రమాల్లో… బీజేపీ సీనియర్‌ నేత, పొగాకు బోర్డు చైర్మన్‌ ఎడ్లపాటి రఘునాథ బాబు సంచలన విషయాలు చెప్పారు.

ఈనాడు పత్రిక కథనాల వల్లే వాసవీ బ్యాంకు కుప్పకూలింది...
X

తప్పుడు కథనాలు రాస్తే మీడియాపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆయా శాఖ ముఖ్యకార్యదర్శులకు అధికారం అప్పగించడంపై ఈనాడు పత్రిక పెద్దెత్తున విమర్శలు చేస్తూ కథనాలు రాస్తున్న నేపథ్యంలో ఒక చానల్‌లో జరిగిన చర్చ కార్యక్రమాల్లో… బీజేపీ సీనియర్‌ నేత, పొగాకు బోర్డు చైర్మన్‌ ఎడ్లపాటి రఘునాథ బాబు సంచలన విషయాలు చెప్పారు.

కొన్ని దశాబ్దాల క్రితమే రామోజీ రావు ఈనాడు పత్రికను అడ్డుపెట్టుకుని ఎలా వ్యాపారం చేసింది… ఇతరులను ఎలా దెబ్బతీసింది వివరించారు. మొదట్లో ఈనాడు పత్రికలో వచ్చింది అంటే నిజం అని గుడ్డిగా నమ్మేసే పరిస్థితి ఉండేదన్నారు. కానీ తర్వాత పరిస్థితి మారుతూ వచ్చిందన్నారు.

గతంలో చార్మినార్ బ్యాంకు కుదేలైనప్పుడు ఈనాడు పత్రిక పనిగట్టుకుని అవసరానికి మించి కథనాలు రాసిందన్నారు. దాంతో ఇతర బ్యాంకుల డిపాజిటర్లలోనూ ఆందోళన పెరిగి దాని వల్ల కృషి బ్యాంకుతో పాటు వాసవీ బ్యాంకు కూడా కుప్పకూలిందన్నారు. అలాంటి బ్యాంకులన్నీ కూలిపోతే అప్పుడు ఆ డిపాజిట్లు అంతా మార్గదర్శి చిట్‌ఫండ్‌కు వస్తాయన్న ఉద్దేశంతో ఇలా పనిగట్టుకుని కథనాలు రాశారన్న విమర్శ ఉందని… తాను కూడా దాన్ని నమ్ముతానన్నారు. ఇక్కడి పత్రికల్లో వ్యాపార లాభాల అంశం కూడా ఉందన్నారు.

ఒక దశలో ముఖ్యమంత్రులను ఎక్కించడం, దించడం అనేది ఈనాడు పత్రిక చేతిలో ఉన్నట్టుగా పరిస్థితి నడిచిందన్నారు. టీడీపీలో తిరుగుబాటు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ను హీరోను చేసి నాదెండ్ల భాస్కర్‌రావును విలన్‌ను చేసింది…. మరో సందర్భంగా ఎన్టీఆర్‌ను విలన్‌ను చేసి చంద్రబాబును హీరోను చేసింది ఈనాడు పత్రికే అని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత పత్రికలు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. బహుశా తాము చెప్పినా ప్రజలు ఓట్లేయలేదు అన్న బాధ పత్రికలకు ఉన్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు.

First Published:  2 Nov 2019 7:21 AM IST
Next Story