Telugu Global
National

ముంబాయ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఆశ్రయం అమిత్ షాదే...

కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలను గతంలో ముంబాయిలో ఉంచింది బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఆ 17 మంది రాజీనామాలు చేయడం వల్లే ఈ రోజు బీజేపీ కర్నాటకలో అధికారంలో ఉందని వ్యాఖ్యానించారు. 17 మందికి బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడానికి పార్టీ శ్రేణులు వ్యతిరేకించడంతో అందుకు వారిని వారిస్తూ యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. 17 మంది […]

ముంబాయ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఆశ్రయం అమిత్ షాదే...
X

కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలను గతంలో ముంబాయిలో ఉంచింది బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఆ 17 మంది రాజీనామాలు చేయడం వల్లే ఈ రోజు బీజేపీ కర్నాటకలో అధికారంలో ఉందని వ్యాఖ్యానించారు.

17 మందికి బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడానికి పార్టీ శ్రేణులు వ్యతిరేకించడంతో అందుకు వారిని వారిస్తూ యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. 17 మంది రాజీనామాల ఫలితంగానే బీజేపీ అధికారంలో ఉందని… వారంతా భార్య పిల్లలను వదిలేసి రెండు నెలల పాటు ముంబాయిలో ఉన్నారని వివరించారు. వారికి ముంబాయిలో ఆశ్రయం కల్పించింది స్వయాన పార్టీ అధ్యక్షుడు అమిత్ షానే అన్న విషయాన్ని మరిచిపోయారా అంటూ కార్యకర్తలను యడ్యూరప్ప ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం కల్పించిన 17 మందికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో 17 మందిని తిరిగి గెలిపించాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉందన్నారు.

అయితే ఎమ్మెల్యేల రాజీనామా డ్రామా నడిచిన సమయంలో వారే స్వచ్ఛందంగా ముంబాయిలో ఉన్నారంటూ బీజేపీ బుకాయించింది. ఇప్పుడు మాత్రం స్వయంగా ముఖ్యమంత్రి యడ్యూరప్పే … 17 మంది ఎమ్మెల్యేలను ముంబాయిలో ఉంచింది అమిత్ షానే అని చెప్పడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

First Published:  2 Nov 2019 1:41 AM IST
Next Story