Telugu Global
National

ఇక్కడున్నది మరాఠీలు.. బీజేపీ బెదిరింపులు పనిచేయవ్‌...

మహారాష్ట్రలో హంగ్‌ ఫలితాలు రావడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవిని తమకు కూడా రెండున్నరేళ్ల పాటు ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబడుతుండడం, అందుకు బీజేపీ ససేమిరా అంటుండడంతో సమస్య కొలిక్కి రావడం లేదు. ఇంతలోనే బీజేపీ బెదిరింపు ప్రకటనలకు దిగడంపై శివసేన తీవ్రంగా స్పందించింది. నవంబర్‌ 8తో మహా అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండడంతో ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి హెచ్చరించారు. ఈ హెచ్చరికపై శివసేన నేత […]

ఇక్కడున్నది మరాఠీలు.. బీజేపీ బెదిరింపులు పనిచేయవ్‌...
X

మహారాష్ట్రలో హంగ్‌ ఫలితాలు రావడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవిని తమకు కూడా రెండున్నరేళ్ల పాటు ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబడుతుండడం, అందుకు బీజేపీ ససేమిరా అంటుండడంతో సమస్య కొలిక్కి రావడం లేదు. ఇంతలోనే బీజేపీ బెదిరింపు ప్రకటనలకు దిగడంపై శివసేన తీవ్రంగా స్పందించింది.

నవంబర్‌ 8తో మహా అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండడంతో ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి హెచ్చరించారు. ఈ హెచ్చరికపై శివసేన నేత సంజయ్‌ రౌత్ తీవ్రంగా స్పందించారు.

రాష్ట్రపతి బీజేపీ కంట్రోల్‌లో ఉన్నారా లేక బీజేపీ కార్యాలయంలో రాష్ట్రపతి స్టాంప్ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన తెస్తామని చెప్పడం మరాఠీ ప్రజలను అవమానించడం, బెదిరించడమే అవుతుందని మండిపడ్డారు.

మరాఠీలు ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే ఉండదన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. త్వరలోనే ఎదురుచూసే పరిస్థితికి శివసేననే ముగింపు పలుకుతుందని ప్రకటించారు.

288 సీట్లు ఉన్న మహా అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్ 145. ఎన్నికల్లో శివసేనతో పొత్తుపెట్టుకుని బీజేపీ 105 సీట్లు సాధించగా… శివసేన 56 స్థానాలను సొంత చేసుకుంది. ఎన్‌సీపీ 54 స్థానాల్లో, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో గెలుపు సాధించింది. దీంతో శివసేన సాయం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యంగా మారింది.

First Published:  2 Nov 2019 7:28 AM IST
Next Story