Telugu Global
NEWS

లాంగ్ మార్చ్ కి ముందే ప‌వ‌న్‌కు షాక్ !

విశాఖ‌లో రేపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వ‌హించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ మార్చ్ విజ‌య‌వంతం కోసం ఆ పార్టీ నేత‌లు అక్క‌డ మ‌కాం వేసి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే మార్చ్ కు ముందే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగ‌ల‌బోతున్నాయి. మాజీమంత్రి పసుపులేటి బాలరాజు జనసేనకు గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా బాలరాజు పోటీ చేశారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అప్ప‌టి నుంచి […]

లాంగ్ మార్చ్ కి ముందే ప‌వ‌న్‌కు షాక్ !
X

విశాఖ‌లో రేపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వ‌హించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ మార్చ్ విజ‌య‌వంతం కోసం ఆ పార్టీ నేత‌లు అక్క‌డ మ‌కాం వేసి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే మార్చ్ కు ముందే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగ‌ల‌బోతున్నాయి.

మాజీమంత్రి పసుపులేటి బాలరాజు జనసేనకు గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా బాలరాజు పోటీ చేశారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇవాళ పవన్ కు రాజీనామా లేఖ పంపేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

నాదెండ్ల మ‌నోహ‌ర్‌, నాగ‌బాబు నిర్వ‌హించిన మీటింగ్ లకు కూడా బాల‌రాజు వెళ్ల‌లేదు. దీంతో ఆయ‌న పార్టీమార‌డం ఖాయంగా తెలుస్తోంది. కొద్ది రోజులు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండి.. ఆత‌ర్వాత ఏ పార్టీలో చేరాలో నిర్ణ‌యం తీసుకుంటానని బాల‌రాజు స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్పార‌ట‌.

మ‌రోవైపు జ‌న‌సేన మ‌రో నేత ల‌క్ష్మీనారాయ‌ణకు కూడా పార్టీతో గ్యాప్ ఉంది. ఆయ‌న కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం క‌న్పిస్తోంది. లాంగ్‌మార్చ్‌కు రావాల‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, బీజేపీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌కు ప‌వ‌న్ ఫోన్ చేశారు. కానీ జేడీకి మాత్రం పిలుపురాలేదట‌. దీంతో ఆయన నొచ్చుకున్నార‌ట‌. పార్టీ మారే నిర్ణ‌యంపై స‌న్నిహితుల‌తో చ‌ర్చిస్తున్నార‌ట‌.

First Published:  2 Nov 2019 5:27 AM IST
Next Story