Telugu Global
International

డే-నైట్ టెస్ట్ కు విశిష్ట అతిథులు

సచిన్, సానియాలకూ ఆహ్వానం ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి డే-నైట్ టెస్ట్ భారత గడ్డపై జరుగనున్న డే-నైట్ తొలి టెస్ట్ మ్యాచ్ ను ఘనంగా నిర్వహించడానికి బెంగాల్ క్రికెట్ సంఘం అట్టహాసంగా ఏర్పాట్లు ప్రారంభించింది. బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నవంబర్ 22 నుంచి ఐదురోజులపాటు భారత క్రికెట్ మక్కా..కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు పలువురు విశిష్ట అతిథులకు ఆహ్వానాలు పంపినట్లు బీసీసీఐ కమ్ బెంగాల్ […]

డే-నైట్ టెస్ట్ కు విశిష్ట అతిథులు
X
  • సచిన్, సానియాలకూ ఆహ్వానం
  • ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి డే-నైట్ టెస్ట్

భారత గడ్డపై జరుగనున్న డే-నైట్ తొలి టెస్ట్ మ్యాచ్ ను ఘనంగా నిర్వహించడానికి బెంగాల్ క్రికెట్ సంఘం అట్టహాసంగా ఏర్పాట్లు ప్రారంభించింది.

బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నవంబర్ 22 నుంచి ఐదురోజులపాటు భారత క్రికెట్ మక్కా..కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు పలువురు విశిష్ట అతిథులకు ఆహ్వానాలు పంపినట్లు బీసీసీఐ కమ్ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు.

భారత్, బంగ్లా ప్రధానులకూ ఆహ్వానం…

భారత ఉపఖండంలోనే జరుగుతున్న మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా హాజరుకావాలంటూ…భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు ఇప్పటికే ఆహ్వానాలు అందచేశారు.

బంగ్లా ప్రధాని తమ ఆహ్వానాన్ని మనించారని, భారత ప్రధాని జవాబు కోసం ఎదురుచూస్తున్నామని బెంగాల్ క్రికెట్ సంఘం ప్రతినిధి తెలిపారు.

సచిన్, సానియాలకూ పిలుపు…

తాము నిర్వహిస్తున్న డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు అతిథులుగా రావాలంటూ మాస్టర్ సచిన్ టెండుల్కర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు సైతం ఆహ్వానాలు పంపారు.

మ్యాచ్ లో తలపడనున్న రెండుజట్ల సభ్యులతో పాటు…బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు, షూటర్ అభినవ్ భింద్రాలను సన్మానించాలని బెంగాల్ క్రికెట్ సంఘం నిర్ణయించింది.

50 రూపాయలకే టెస్ట్ మ్యాచ్ టికెట్…

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరుగనున్న మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ రోజువారీ టికెట్లను కేవలం 50 రూపాయల ధరకే విక్రయించాలని నిర్ణయించారు. క్రికెట్ అభిమానులతో స్టేడియం కిటకిటలాడాలన్నదే తమ లక్ష్యమని బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి అంటున్నారు.

ఈడెన్ గార్డెన్స్ లో 90వేల నుంచి లక్షమంది వరకూ అభిమానులు కూర్చొని మ్యాచ్ తిలకించే వీలుంది. మ్యాచ్ తొలిరోజున విఖ్యాత సింగర్లు ఉషా ఉతుప్, రూనా లైలా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

19 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ను కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగానే భారత్ తో ఆడిన సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిందే.

ఆ మ్యాచ్ లో పాల్గొన్న రెండుదేశాల క్రికెటర్లను సైతం ఈ సందర్బంగా ప్రత్యేక జ్ఞాపికలతో సత్కరించనున్నారు.

First Published:  2 Nov 2019 7:18 AM IST
Next Story