Telugu Global
National

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త...7 నుంచి చెల్లింపులు

ఏపీ ఖజానా ఖాళీగా ఉంది. ఆర్థికంగా ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. అయినా కూడా సీఎం జగన్ మాత్రం మాట తప్పడం లేదు. హామీ ఇచ్చినట్టుగానే లబ్ధిదారులు, బాధితుల కష్టాలు తీరుస్తున్నారు. చంద్రబాబు చేయలేని పనిని కూడా తాజాగా చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. సీఎం జగన్ నవంబర్ 7న గుంటూరులో అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసి మోసపోయిన లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేయడానికి రెడీ అయ్యారు. 10,000 లేదా అంతకంటే తక్కువ మొత్తం డిపాజిట్ చేసిన 3.69 లక్షల […]

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త...7 నుంచి చెల్లింపులు
X

ఏపీ ఖజానా ఖాళీగా ఉంది. ఆర్థికంగా ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. అయినా కూడా సీఎం జగన్ మాత్రం మాట తప్పడం లేదు. హామీ ఇచ్చినట్టుగానే లబ్ధిదారులు, బాధితుల కష్టాలు తీరుస్తున్నారు. చంద్రబాబు చేయలేని పనిని కూడా తాజాగా చేసి ప్రశంసలు అందుకుంటున్నారు.

సీఎం జగన్ నవంబర్ 7న గుంటూరులో అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసి మోసపోయిన లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేయడానికి రెడీ అయ్యారు. 10,000 లేదా అంతకంటే తక్కువ మొత్తం డిపాజిట్ చేసిన 3.69 లక్షల మంది డిపాజిటర్లకు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.264.99 కోట్లను విడుదల చేసింది.

సీఎం జగన్ గుంటూరులో ఒకే ఒక బటన్ నొక్కడం ద్వారా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ 264.99 కోట్లు చేరిపోతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

సీఎంగా గద్దెనెక్కాక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కూడా సీఎం జగన్ హామీ ఇచ్చినవి నెరవేర్చడంలో వెనక్కి తగ్గడం లేదు. ఇదివరకే హామీనిచ్చినట్టు ‘వైఎస్ఆర్ వాహన మిత్ర’ పథకంలో రూ.10000లను ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.

ఇక ఖరీఫ్, రబీకి రైతులకు భరోసానివ్వడానికి ఇప్పటికే ప్రకటించిన రైతు భరోసా పథకంలో రూ.4000 ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు. కౌలురైతులకు రూ.1300 చొప్పున చెల్లింపులు చేశారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు చెల్లించేందుకు రెడీ అయ్యారు. ఏపీలో ఖాళీ ఖజానా ఉన్నా పథకాల అమలులో చిత్తశుద్ధి చూపిస్తున్న జగన్ తీరుపై లబ్ధిదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

First Published:  2 Nov 2019 9:25 AM IST
Next Story