Telugu Global
National

నేడు కష్టాల్లో ఉండొచ్చు... కానీ ఏపీకి మంచి రోజులు వస్తాయ్...

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ ఇందిరాగాంధీ స్డేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులతో పాటు పలువురు మహానుభావుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రసంగించిన జగన్‌ మోహన్ రెడ్డి… గతంలో చెప్పినట్టుగా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఊహించని పరిణామాలు జరిగాయన్నారు. ఇలా రాష్ట్రం విడిపోతుందని ఎప్పుడూ […]

నేడు కష్టాల్లో ఉండొచ్చు... కానీ ఏపీకి మంచి రోజులు వస్తాయ్...
X

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ ఇందిరాగాంధీ స్డేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులతో పాటు పలువురు మహానుభావుల కుటుంబ సభ్యులను సన్మానించారు.

కార్యక్రమంలో ప్రసంగించిన జగన్‌ మోహన్ రెడ్డి… గతంలో చెప్పినట్టుగా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఊహించని పరిణామాలు జరిగాయన్నారు.

ఇలా రాష్ట్రం విడిపోతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. విభజన వల్ల దేశంలో ఏ రాష్ట్రం పడనట్టుగా ఆంధ్రప్రదేశ్ దగా పడిందన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ది చెందడం తప్ప మనకు మరో దారి లేదన్నారు. పేదరికాన్ని, నిరక్షరాస్యతను ఎదుర్కొన్నప్పుడే పైకి ఎదగగలుగుతామన్నారు.

విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నామన్నారు. ఆ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

నేడు రాష్ట్రం ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నా … భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చి తీరుతాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

First Published:  1 Nov 2019 3:48 PM IST
Next Story