Telugu Global
NEWS

టీడీపీ నోటి మాట ఉద్యోగులకు స్వస్తి...

చంద్రబాబు హయాంలో ఉద్యోగాల నియామకాల్లోనూ పెద్దెత్తున పక్షపాతం చూపారు. టీడీపీ సానుభూతిపరులు, ఒక సామాజికవర్గానికి చెందిన వారిని నోటి మాట మీదే భారీ జీతాలు ఇచ్చి వివిధ శాఖల్లోకి చొప్పించారు. ఉద్యోగాల భర్తీకి పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వకుండా వివిధ శాఖల్లో తన మనుషులను టీడీపీ నేతలు చొప్పించారు. ఇలాంటి వారు వేలాది మంది ఉన్నారు. 40 వేలకు పైగా జీతాలు తీసుకుంటున్న వారు భారీగా ఉన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే టీడీపీ హయాంలో మాత్రం […]

టీడీపీ నోటి మాట ఉద్యోగులకు స్వస్తి...
X

చంద్రబాబు హయాంలో ఉద్యోగాల నియామకాల్లోనూ పెద్దెత్తున పక్షపాతం చూపారు. టీడీపీ సానుభూతిపరులు, ఒక సామాజికవర్గానికి చెందిన వారిని నోటి మాట మీదే భారీ జీతాలు ఇచ్చి వివిధ శాఖల్లోకి చొప్పించారు. ఉద్యోగాల భర్తీకి పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వకుండా వివిధ శాఖల్లో తన మనుషులను టీడీపీ నేతలు చొప్పించారు.

ఇలాంటి వారు వేలాది మంది ఉన్నారు. 40 వేలకు పైగా జీతాలు తీసుకుంటున్న వారు భారీగా ఉన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే టీడీపీ హయాంలో మాత్రం రిటైర్ అయిన టీడీపీ సానుభూతిపరులకు భారీగా జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు.

ఇలా ప్రతి శాఖలో, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో చంద్రబాబు హయాంలో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగుల హవా కొనసాగుతోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగతి సరే సరి. చంద్రబాబుకు సన్నిహితులైన వ్యక్తులకు సంబంధించిన ఏజెన్సీల ద్వారా కావాల్సిన వారిని ఉద్యోగాల్లోకి దించేశారు.

పలు శాఖల్లో టీడీపీ వీరాభిమానులు ఇలా పాతుకుపోయారు. వీరి వల్ల పాలనకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అర్హతలతో సంబంధం లేకుండా, పత్రికల్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇలా వేలాదిగా తన వారిని చంద్రబాబు నియమించుకున్నారు.

ఈ నేపథ్యంలో అలాంటి వారిని పక్కనపెట్టేందుకు కొత్త ప్రభుత్వం సిద్దమైంది. పత్రికల్లో నోటిఫికేషన్ కూడా లేకుండా నేరుగా రికమెండేషన్‌తో ఉద్యోగాలు కొట్టేసి, 40వేల రూపాయలకు పైగా జీతం తీసుకుంటున్న వారిని తప్పించాలని ఆదేశించింది. అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా భారీగా జీతాలు తీసుకుంటూ ప్రభుత్వంలో తిష్టవేసిన వారిని కూడా తొలగించాలని ఆదేశించింది.

టీడీపీ హయాంలో నేరుగా నియమితులైన వారిని తొలగించి ఆయా ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేసి… రాజకీయ పలుకుబడి లేని సామాన్యులకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పరిణామంపై సహజంగానే టీడీపీ గగ్గోలు పెడుతోంది. ఉద్యోగాలు తీసేస్తున్నారంటూ తన మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టింది. చంద్రబాబు హయాంలో నియమితులైన తమ వారి ఉద్యోగాలకు ఎసరు వస్తోందన్న ఉద్దేశంతో చంద్రబాబు అండ్ టీం ఆందోళన చెందుతోంది.

First Published:  1 Nov 2019 2:43 AM IST
Next Story