Telugu Global
National

శీతాకాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లు ఉండకపోవచ్చు...

ఢిల్లీని వాయు కాలుష్యం అల్లాడిస్తోంది. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 3న కోట్లా స్డేడియంలో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన టీ20 మ్యాచ్‌ను రద్దు చేయాలన్న డిమాండ్ వచ్చింది. దీనిపై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మ్యాచ్ రద్దు డిమాండ్‌ను తోసిపుచ్చారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని… మ్యాచ్ నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ సమయంలో మ్యాచ్ రద్దు కుదరదని వ్యాఖ్యానించారు. అయితే వచ్చే ఏడాది నుంచి శీతాకాలంలో ఉత్తర భారతదేశం […]

శీతాకాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లు ఉండకపోవచ్చు...
X

ఢిల్లీని వాయు కాలుష్యం అల్లాడిస్తోంది. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 3న కోట్లా స్డేడియంలో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన టీ20 మ్యాచ్‌ను రద్దు చేయాలన్న డిమాండ్ వచ్చింది. దీనిపై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మ్యాచ్ రద్దు డిమాండ్‌ను తోసిపుచ్చారు.

ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని… మ్యాచ్ నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ సమయంలో మ్యాచ్ రద్దు కుదరదని వ్యాఖ్యానించారు. అయితే వచ్చే ఏడాది నుంచి శీతాకాలంలో ఉత్తర భారతదేశం వేదికగా మ్యాచ్‌లు నిర్వహించే అంశంపై వాస్తవానికి దగ్గరగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ వాతావరణ అధికారులతో మాట్లాడామని.. మ్యాచ్‌ నిర్వాహణకు ఇబ్బంది ఉండకపోవచ్చన్నారు.

ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని తాము భావించడం లేదని టీ20కి సారథ్యం వహించబోతున్న రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగానూ తామేమీ ఇబ్బందులు పడలేదన్నారు. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు. వారు ముఖానికి మాస్క్‌లు ధరించి ప్రాక్టిస్‌ చేస్తున్నారు.

2017లో శ్రీలంక ఆటగాళ్లు కూడా ఢిల్లీ వాయు కాలుష్యానికి ఇబ్బంది పడ్డారు. వారు అప్పట్లో మాస్కులు ధరించారు. కొందరు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు.

First Published:  1 Nov 2019 1:00 AM IST
Next Story