Telugu Global
National

అనుష్కకు టీ కప్పులు అందిస్తూ కనిపించారు " ఎంఎస్‌కే ప్రసాద్‌పై ఫరూక్‌

భారత క్రికెట్‌లో సెలెక్టర్ల అర్హత మరోసారి చర్చకు వచ్చింది. కొద్దిరోజుల క్రితం అంబటి రాయుడిని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటి పక్కన పెట్టడంతో దుమారం రేగింది. దాంతో రాయుడు క్రికెట్‌కే గుడ్‌బై చెప్పారు. అంబటిరాయుడు, ఎంఎస్‌కే ప్రసాద్ ఇద్దరూ ఏపీకి చెందిన వారే కావడంతో కావాలనే ప్రసాద్‌… రాయుడిని దెబ్బకొట్టారన్న చర్చ కూడా జరిగింది. గంభీర్ లాంటి వారు నాడే ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఉన్న అర్హతేంటి అని బహిరంగంగా ప్రశ్నించారు. ఎంఎస్‌కే ప్రసాద్‌తో పాటు […]

అనుష్కకు టీ కప్పులు అందిస్తూ కనిపించారు  ఎంఎస్‌కే ప్రసాద్‌పై ఫరూక్‌
X

భారత క్రికెట్‌లో సెలెక్టర్ల అర్హత మరోసారి చర్చకు వచ్చింది. కొద్దిరోజుల క్రితం అంబటి రాయుడిని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటి పక్కన పెట్టడంతో దుమారం రేగింది. దాంతో రాయుడు క్రికెట్‌కే గుడ్‌బై చెప్పారు.

అంబటిరాయుడు, ఎంఎస్‌కే ప్రసాద్ ఇద్దరూ ఏపీకి చెందిన వారే కావడంతో కావాలనే ప్రసాద్‌… రాయుడిని దెబ్బకొట్టారన్న చర్చ కూడా జరిగింది.

గంభీర్ లాంటి వారు నాడే ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఉన్న అర్హతేంటి అని బహిరంగంగా ప్రశ్నించారు. ఎంఎస్‌కే ప్రసాద్‌తో పాటు సెలక్టర్ల పరుగులన్నీ కలిపినా అంబటి రాయుడి చేసినన్ని పరుగులు కూడా లేవని గంభీర్ ఎద్దేవా చేశారు.

తాజాగా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్… ఎంఎస్‌కే ప్రసాద్‌తో పాటు సెలెక్టర్ల టీంపై తీవ్ర విమర్శలు చేశారు. కోహ్లి భార్య అనుష్క శర్మకు టీ కప్పులు మోయడం మాత్రమే సెలెక్టర్లకు తెలుసు అంటూ పరోక్షంగా ఎంఎస్‌కే ప్రసాద్‌పై ఫరూక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సెలెక్టర్లను ఏ ప్రమాణికంతో తీసుకున్నారని ప్రశ్నించారు. ఇదో మికీ మౌస్ కమిటీ అని ఎద్దేవా చేశారు. ఆ కమిటీ కోహ్లి ప్రభావంతోనే పనిచేస్తుందని విమర్శించారు.

ఇటీవల వరల్డ్ కప్ సమయంలో తాను అక్కడ సెలెక్టర్లను చూశానని… వారిలో ఒకరిని తాను గుర్తు పట్టలేదు అంటూ ఎంఎస్‌కే ప్రసాద్‌పై ఫరూక్ కామెంట్స్ చేశారు. సదరు వ్యక్తి టీమిండియా బ్లేజర్ వేసుకుని ఉండడంతో మీరు ఎవరు అని అడిగానని అందుకు ఆయన సెలక్టర్‌ను అని చెప్పాడు అంటూ ఎంఎస్‌కే ప్రసాద్‌పై వ్యాఖ్యలు చేశారు. వారు అక్కడ కోహ్లి భార్య అనుష్క శర్మకు టీ అందిస్తూ కనిపించారని … మిగిలిన వారు కూడా దీన్ని చూసి ఉంటారని వ్యాఖ్యానించారు. భారత సెలెక్షన్ కమిటీలో ఉండాల్సింది టీ కప్పులు అందించే వారు కాదని… వెంగసర్కార్‌ లాంటి వ్యక్తులు ఉండాలని సూచించారు.

ఎంఎస్‌కే ప్రసాద్‌ తనకు టీ కప్పులు అందించారంటూ వచ్చిన విమర్శలపై అనుష్క శర్మ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు తనపై ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఏదో పిచ్చి ప్రేలాపన చేసి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం మంచిది కాదన్నారు.

సెలక్టర్లతో పాటు టీమిండియా కెప్టెన్ భార్య పరువును కూడా తీస్తున్నారని… 82 ఏళ్ల వ్యక్తి వ్యవహరించాల్సిన విధానం ఇదేలా అని అనుష్క ప్రశ్నించారు. తాను సొంత ఖర్చుతోనే క్రికెట్‌ చూసేందుకు వెళ్తుంటానని… తాను ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చుంటానే గానీ… సెలక్టర్ల బాక్స్‌లో కాదని అనుష్క వివరించారు.

First Published:  1 Nov 2019 1:16 AM IST
Next Story