Telugu Global
NEWS

ఫరూక్ ఇంజనీర్ వ్యాఖ్యలతో అనుష్కశర్మ లబోదిబో

వివాదంలోకి తనను లాగొద్దంటూ అనుష్క వివరణ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్కశర్మ మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అనుష్క శర్మకు భారత సెలెక్టర్లు టీకప్పులు అందిస్తూ బతికేస్తున్నారంటూ భారత క్రికెట్ మాజీ దిగ్గజం, 80 సంవత్సరాల ఫరూక్ ఇంజనీర్ వ్యాఖ్యానించడంతో… టీ కప్పు నుంచే భారత క్రికెట్లో మరో తుపాను ప్రారంభమయ్యింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టో్ర్నీలో భారతజట్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో అనుష్కశర్మకు భారత సెలెక్టర్లు టీకప్పులు అందించడం […]

ఫరూక్ ఇంజనీర్ వ్యాఖ్యలతో అనుష్కశర్మ లబోదిబో
X
  • వివాదంలోకి తనను లాగొద్దంటూ అనుష్క వివరణ

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్కశర్మ మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అనుష్క శర్మకు భారత సెలెక్టర్లు టీకప్పులు అందిస్తూ బతికేస్తున్నారంటూ భారత క్రికెట్ మాజీ దిగ్గజం, 80 సంవత్సరాల ఫరూక్ ఇంజనీర్ వ్యాఖ్యానించడంతో… టీ కప్పు నుంచే భారత క్రికెట్లో మరో తుపాను ప్రారంభమయ్యింది.

ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టో్ర్నీలో భారతజట్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో అనుష్కశర్మకు భారత సెలెక్టర్లు టీకప్పులు అందించడం తాను చూశానని ఫరూక్ ఇంజనీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో కలకలం రేగింది.

ఏ మాత్రం అర్హత లేని, అనుభవం లేని వ్యక్తులు సెలెక్టర్లా అంటూ ఇంజనీర్ నిలదీయటం చర్చనీయాంశంగా మారింది. సెలెక్షన్ కమిటీలోని సభ్యులందరికీ కలిపి..10నుంచి 12 టెస్టులు ఆడిన అనుభవం లేదని…ఇలాంటి వ్యక్తులు భారతజట్టును ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.

అనుష్క రియాక్షన్…

ఫరూక్ ఇంజనీర్ భారత సెలెక్టర్లపైన వ్యాఖ్యలు చేస్తూ తనను కేంద్రబిందువుగా చేయటాన్ని విరాట్ కొహ్లీ భార్య అనుష్క శర్మ తప్పు పట్టింది. ప్రపంచకప్ జరిగిన సమయంలో తాను కేవలం ఒకే ఒక్క మ్యాచ్ కు హాజరయ్యానని..తాను ఫ్యామిలీ బాక్సులో మాత్రమే ఉన్నానంటూ వివరణ ఇచ్చింది.

సెలెక్టర్ల అర్హతల గురించి మాట్లాడే హక్కు ఫరూక్ ఇంజనీర్ కు ఉందని…అయితే …తనను వివాదంలోకి లాగటంలో ఏమాత్రం అర్ధం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.

మరోవైపు…అనుష్క శర్మ సెలెక్టర్ల బాక్సులో టీ కప్పుతో నిలబడటం, ఆమె పక్కనే చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, మరో సెలెక్టర్ కూర్చొని ఉన్న ఫోటో.. మీడియాలో చక్కర్లు కొడుతూ ఫరూక్ ఇంజనీర్ ఆరోపణ నిజమేననిపించేలా చేస్తోంది.

ఇదో రాక్షసానందం- ఎమ్మెస్కే ప్రసాద్..

భారత సెలెక్షన్ కమిటీని మిక్కీ మౌస్ గ్యాంగ్ అంటూ విమర్శించడంతో పాటు…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ భార్య అనుష్క శర్మను వివాదంలోకి లాగడం..రాక్షసానందమేనంటూ…చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మండి పడ్డారు. 82 సంవత్సరాల వయసున్న ఫరూక్ ఇంజనీర్ తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని విమర్శించారు.

భారత క్రికెట్ బోర్డు…సెలెక్షన్ కమిటీ సభ్యులను…సర్వసభ్యమండలి సమావేశం ద్వారా ఎంపిక చేసిందని…తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం 82 సంవత్సరాల వయసున్న వ్యక్తికి తగదని బదులిచ్చారు.

భారత క్రికెట్ బోర్డు, ఎంపిక సంఘాన్ని, భారత కెప్టెన్ భార్యను తన వ్యాఖ్యలతో ఫరూక్ ఇంజనీర్ చిన్నబోయేలా చేశారని, ప్రతిష్టకు భంగం కలిగించారని.. భారత క్రికెట్ అభివృద్ధిని చూసి సంతోషించాల్సింది పోయి…అర్థం పర్థం లేని విమర్శలు చేయటం ఏమాత్రం సమర్థనీయం కాదని ఎమ్మేస్కే వివరణ ఇచ్చాడు.

ఎమ్మేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీలో శరణ్ దీప్ సింగ్, జతిన్ పరంజపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.

ఏడాదికి 50 లక్షల రూపాయల వరకూ వేతనం ఆందుకొంటున్న ఈ సెలెక్టర్లందరూ కలసినా 12 టెస్టులు ఆడిన అనుభవం లేకపోడాన్ని, భారత కెప్టెన్ భార్యకు టీ కప్పులు అందించడాన్ని ఫరూక్ ఇంజనీర్ తప్పు పడుతూ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. వివాదానికి తెరతీశారు.

First Published:  1 Nov 2019 2:40 AM IST
Next Story