Telugu Global
National

ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం..... స్కూళ్ళకు సెలవులు

దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో కాలుష్యం చేరింది. దాంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి కాలుష్యం సూచి 582కు పెరిగింది. గాలి కాలుష్యం సూచి సాధారణంగా 0-50 వరకు మంచి వాతావరణం అని లెక్క. 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్తంగా భావిస్తారు. 301-400 మధ్య ఉండే ఏమాత్రం సరైన గాలి కాదు అని అర్థం. సూచి 401-500 మధ్య ఉంటే ప్రమాదకరమైన గాలిగా భావిస్తారు. […]

ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం..... స్కూళ్ళకు సెలవులు
X

దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో కాలుష్యం చేరింది. దాంతో జనం అల్లాడిపోతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో గాలి కాలుష్యం సూచి 582కు పెరిగింది. గాలి కాలుష్యం సూచి సాధారణంగా 0-50 వరకు మంచి వాతావరణం అని లెక్క. 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్తంగా భావిస్తారు.

301-400 మధ్య ఉండే ఏమాత్రం సరైన గాలి కాదు అని అర్థం. సూచి 401-500 మధ్య ఉంటే ప్రమాదకరమైన గాలిగా భావిస్తారు. గాలి కాలుష్యం సూచి 500 దాటితే ఆ గాలి పీల్చడం ప్రమాదకరం. 500 దాటిన తర్వాత ఎమర్జెన్సీ గా భావిస్తారు. ఇప్పుడు ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 581కి చేరింది.

దాంతో ప్రభుత్వం అనేక చర్యలకు సిద్ధమైంది. ఢిల్లీలోని కాలుష్య ప్రాంతాల్లో నవంబర్‌ 5 వరకు నిర్మాణ పనులను, స్టోన్ క్రషర్లపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈ శీతాకాలంలో బాణాసంచా పేల్చడంపైనా నిషేధం విధించింది. నవంబర్ 5 వరకు బొగ్గు ఆధారిత పరిశ్రమలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. వాయు కాలుష్యం కారణంగా నవంబర్‌ 5 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

సాధారణంగానే ఢిల్లీలో కాలుష్యం అధికం. దీనికి తోడు దీపావళి సందర్బంగా భారీగా బాణాసంచా కాల్చడం, వాహనాల పొగ తో పాటు… పక్కనే ఉన్న పంజాబ్, హర్యానా నుంచి కూడా భారీగా పొగ వస్తోంది. అక్కడి రైతులు పంట కోత పూర్తి కాగానే పంట వ్యర్థాలను పొలాల్లో కాలుస్తున్నారు. దీంతో భారీగా ఢిల్లీపై పొగ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో బాణా సంచా కాల్చకుండా చూడాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవాలని కోరింది.

First Published:  1 Nov 2019 10:59 AM IST
Next Story