స్పందన, వీక్లీ ఆఫ్‌పై ప్రధాని ఆరా... ప్రశంసలు
పోలీసు శాఖలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని వడోదరలో అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు, దేశ బలగాల విభాగాలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని ఆ సందర్భంగా ఏపీ స్టాల్ విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఏపీ పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన, పోలీసులకు వీక్లీ […]
పోలీసు శాఖలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని వడోదరలో అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు, దేశ బలగాల విభాగాలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని ఆ సందర్భంగా ఏపీ స్టాల్ విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ఏపీ పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన, పోలీసులకు వీక్లీ ఆఫ్‌పై ప్రధాని ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచారు. ఈ రెండు కార్యక్రమాల అమలు ఎలా సాధ్యం అన్న దానిపై డీఐజీ పాలరాజు నుంచి ప్రధాని వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్ర స్థాయి నుంచి మండల పోలీస్ స్టేషన్ వరకు ప్రతివారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పాలరాజు ప్రధానికి వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను…. వచ్చే వారం స్పందన కార్యక్రమం నాటికి పరిష్కరించేలా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం వల్ల ప్రజలకు పోలీస్ సేవలు మరింత సులువుగా దక్కుతున్నాయని వివరించారు.
దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నట్టు ప్రధానికి వివరించగా… ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు విధానంపై తనకు నోట్ ఇవ్వాల్సిందిగా ప్రధాని స్వయంగా అడిగి తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని ప్రధాని అక్కడున్న పోలీసులను అభినంధించారు.