Telugu Global
NEWS

రవి శాస్త్రి విజయానందం

పిచ్ లతో పనిలేదంటున్న భారత చీఫ్ కోచ్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ వరుస విజయాలతో ఓ వైపు దూసుకుపోతుంటే…మరోవైపు భారత జట్టు ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి విజయానందంతో మురిసిపోతున్నాడు. వెస్టిండీస్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లో 2-0, 3వ ర్యాంకర్ సౌతాఫ్రికాతో జరిగిన తీన్మార్ టెస్ట్ సిరీస్ లో 3-0 విజయాలతో క్లీన్ స్వీప్ విజయాలు సాధించడమే కాదు… మొత్తం 240 పాయింట్లతో..9 జట్ల లీగ్ […]

రవి శాస్త్రి విజయానందం
X
  • పిచ్ లతో పనిలేదంటున్న భారత చీఫ్ కోచ్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ వరుస విజయాలతో ఓ వైపు దూసుకుపోతుంటే…మరోవైపు భారత జట్టు ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి విజయానందంతో మురిసిపోతున్నాడు.

వెస్టిండీస్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లో 2-0, 3వ ర్యాంకర్ సౌతాఫ్రికాతో జరిగిన తీన్మార్ టెస్ట్ సిరీస్ లో 3-0 విజయాలతో క్లీన్ స్వీప్ విజయాలు సాధించడమే కాదు… మొత్తం 240 పాయింట్లతో..9 జట్ల లీగ్ టేబుల్ టాపర్ గా భారతజట్టు నిలవడంతో తమకు ఇక ఎదురేలేదని ధీమాగా చెబుతున్నాడు.

పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన బ్యాటింగ్, పాదరసం లాంటి ఫీల్డింగ్ తో భారతజట్టు… ఫెరారీ రేస్ కార్ లాగా దూసుకు పోతోందని… ఇక తమకు స్వదేశమైనా…విదేశమైనా.. స్పిన్ పిచ్ లేదా ఫాస్ట్ పిచ్ అయినా..ఏమాత్రం పనిలేదని రవిశాస్త్రి ధీమాగా చెప్పాడు.

తమ బౌలర్లు 20 వికెట్లు పడగొట్టినంత కాలం విజయాలకు ఢోకా లేదని తెలిపాడు. జోహెన్స్ బర్గ్, ఢిల్లీ, ముంబై, అక్లాండ్, మెల్బోర్న్..నగరం ఏదైనా…వికెట్ ఏదైనా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో దూసుకుపోయే సత్తా తమజట్టుకు ఉందని తెలిపాడు.

రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, విరాట్ కొహ్లీ, పూజారా, రహానే అత్యుత్తమ స్థాయిలో పరుగులు సాధిస్తుంటే… ఐదుగురు బౌలర్ల తమ బౌలింగ్ ఎటాక్ 20 వికెట్లు పడగొట్టడం ఏమంత కష్టంకాబోదని అన్నాడు.

షాబాజ్ కు షెబాష్…

సౌతాఫ్రికా సిరీస్ లో ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ…తన స్థానానికి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని…రాంచీ టెస్ట్ మొదటి రెండుగంటల ఆటలో ఎక్కడలేని ఓర్పు, నేర్పు చూపాడని… ఆ తర్వాత డబుల్ సెంచరీతో తానే బాస్ నని చాటుకొన్నాడని ప్రశంసించాడు.

మరోవైపు…15 ఏళ్ల నిరీక్షణ తర్వాత టెస్ట్ క్యాప్ సాధించిన లెఫ్టామ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్..గొప్పగా బౌల్ చేశాడని…టెస్ట్ క్రికెట్లో తన మొదటి మూడు ఓవర్లను మేడిన్ ఓవర్లతో మొదలు పెట్టాడని, చక్కటి లూప్, దానికి తోడు బొంగరంలా మెలికలు తిరిగే స్పిన్ తో అలరించాడని కొనియాడాడు.

పదిహేను సంవత్సరాల కష్టం, నిరీక్షణకు తగిన ఫలితాన్ని నదీమ్ సాధించడం సంతృప్తి నిచ్చిందని రవిశాస్త్రి తెలిపాడు.

First Published:  31 Oct 2019 5:54 AM IST
Next Story