బిగ్ యూ టర్న్... ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో చంద్రబాబు రహస్య భేటీ?
ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు మోడీతో కలిసి ఉన్న చంద్రబాబు ఆ తర్వాత మోడీపై తొడకొట్టి కాంగ్రెస్‌తో కాపురం చేశారు. చంద్రబాబుతో దోస్తి దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి మోడీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు కంగుతిన్నారు. అప్పటి నుంచి మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు… ఇటీవల మోడీతో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూ మాట్లాడుతున్నారు. తన సహచరులు సుజనా, సీఎం రమేష్ లను బీజేపీలోకి పంపించారు. […]
ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు మోడీతో కలిసి ఉన్న చంద్రబాబు ఆ తర్వాత మోడీపై తొడకొట్టి కాంగ్రెస్‌తో కాపురం చేశారు. చంద్రబాబుతో దోస్తి దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి మోడీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు కంగుతిన్నారు.
అప్పటి నుంచి మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు… ఇటీవల మోడీతో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూ మాట్లాడుతున్నారు. తన సహచరులు సుజనా, సీఎం రమేష్ లను బీజేపీలోకి పంపించారు. అలా బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. నేరుగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశారు.
నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంపై చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.
చంద్రబాబు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో భేటీ అంశాన్ని రిలయన్స్ గ్రూపుకు చెందిన న్యూస్ 18 సంస్థ ప్రచురించింది. అయితే ఈ భేటీ అంశాన్ని చంద్రబాబు అత్యంత గోప్యంగా ఉంచినట్టు ఆ సంస్థ వెల్లడించింది. చంద్రబాబు, మోహన్ భగవత్ భేటీకి కేంద్ర మంత్రి గడ్కరీ రాయబారం నడిపినట్టు చెబుతున్నారు.