Telugu Global
NEWS

నవయుగకు చుక్కెదురు... పోలవరంపై స్టే ఎత్తేసిన హైకోర్టు

పోలవరం హైడల్ ప్రాజెక్టు విషయంలో నవయుగ కంపెనీకి చుక్కెదురైంది. హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ కంపెనీ గతంలో కోర్టును ఆశ్రయించింది. దాంతో హైకోర్టు ఈ కాంట్రాక్టు రద్దుపై స్టే ఇచ్చింది. అయితే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం డ్యాం, హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు రివర్స్ టెండరింగ్ కూడా నిర్వహించింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా సొమ్ము ఆదా అయింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. అయితే […]

నవయుగకు చుక్కెదురు... పోలవరంపై స్టే ఎత్తేసిన హైకోర్టు
X

పోలవరం హైడల్ ప్రాజెక్టు విషయంలో నవయుగ కంపెనీకి చుక్కెదురైంది. హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ కంపెనీ గతంలో కోర్టును ఆశ్రయించింది. దాంతో హైకోర్టు ఈ కాంట్రాక్టు రద్దుపై స్టే ఇచ్చింది.

అయితే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం డ్యాం, హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు రివర్స్ టెండరింగ్ కూడా నిర్వహించింది.

ఈ రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా సొమ్ము ఆదా అయింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. అయితే ప్రాజెక్టు నిర్మాణంపై కొత్త కాంట్రాక్టు సంస్థతో ముందుకెళ్లేందుకు హైకోర్టు ఇచ్చిన స్టే అడ్డంకిగా ఉంటూ వచ్చింది.

నేడు ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో పోలవరం నిర్మాణ పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ అయింది. నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసినట్టుగా కోర్టు ప్రకటించింది.

కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
ఆర్బిట్రేషన్ పక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్‌కు విలువ ఉండదన్న అడ్వకేట్ జనరల్ వాదనతో కోర్టు ఏకీభవించింది.

First Published:  31 Oct 2019 11:37 AM IST
Next Story