"అతి" తగ్గించుకుంటున్న బోయపాటి
బయట బాగానే ఉంటాడు. సినిమాల్లోకి వచ్చేసరికి మాత్రం తన విశ్వరూపం చూపిస్తుంటాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ దర్శకుడి సినిమాల్లో యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. రియల్ లైఫ్ లో ఇది సాధ్యమా అనిపించేలా ఉంటుంది. కానీ అదే తర్వాత కాలంలో బోయపాటి బ్రాండ్ గా కూడా మారింది. అయితే వినయ విధేయ రామ సినిమాలో మాత్రం బోయపాటి మరీ హద్దులు దాటేశారు. ఆ “అతి”ని ప్రేక్షకులే కాదు, మెగాభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. కేవలం ఈ “అతి” […]
బయట బాగానే ఉంటాడు. సినిమాల్లోకి వచ్చేసరికి మాత్రం తన విశ్వరూపం చూపిస్తుంటాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ దర్శకుడి సినిమాల్లో యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. రియల్ లైఫ్ లో ఇది సాధ్యమా అనిపించేలా ఉంటుంది. కానీ అదే తర్వాత కాలంలో బోయపాటి బ్రాండ్ గా కూడా మారింది.
అయితే వినయ విధేయ రామ సినిమాలో మాత్రం బోయపాటి మరీ హద్దులు దాటేశారు. ఆ “అతి”ని ప్రేక్షకులే కాదు, మెగాభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. కేవలం ఈ “అతి” కారణంగానే వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ గా కూడా నిలిచింది.
ఈ సినిమా దెబ్బతో తననుతాను కాస్త మార్చుకున్నాడు బోయపాటి. యాక్షన్ విషయంలో మరీ అతికి పోకుండా, ఉన్నంతలో వాస్తవానికి దగ్గరగా సన్నివేశాలు చిత్రీకరించాలని ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే బాలయ్యతో కలిసి సెట్స్ పైకి రాబోతున్న ఈ దర్శకుడు.. చాలా రియలిస్టిక్ గా కొన్ని యాక్షన్ సన్నివేశాలు రాసుకున్నాడట. సినిమాకు అవి ప్లస్ పాయింట్స్ అవుతాయంటున్నారు.
నిజానికి బాలయ్య సినిమాలకు ఈ “అతి” యాక్షన్ వ్యవహారం సూట్ అవుతుంది. తొడకొట్టి ట్రైన్ ఆపేసినా, పారాచ్యూట్ తో పాకిస్థాన్ లో ల్యాండ్ అయినా, కంటిచూపుతో వ్యవహారాన్ని ముగించేసినా అది బాలయ్యకే చెల్లుతుంది.
కాబట్టి బాలయ్య సినిమాల విషయంలో బోయపాటి తన మార్క్ చూపించుకోవచ్చు. కానీ ఈసారి ఆ ప్రయత్నం కూడా చేయడం లేదంట బోయపాటి. బాలయ్యను కూడా రియలిస్టిక్ గానే చూపించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. కాస్త పొలిటికల్ టచ్ లో కూడా సాగుతుంది ఈ కొత్త సినిమా. రూలర్ కంప్లీట్ అయిన వెంటనే ఇది మొదలవుతుంది.