Telugu Global
International

మోడీ ప్రచార స్టంట్‌లో నేను భాగం కాలేను " ఇంగ్లండ్ ఎంపీ

జమ్ము కశ్మీర్‌లో స్థానిక పరిస్థితులను నేరుగా తెలుసుకునేందుకు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యుల బృందం అక్కడ పర్యటించింది. పూర్తిగా స్తంభించిన ప్రజా వ్యవస్థ నడుమ ఖాళీ వీధుల్లో వీరి పర్యటన సాగింది. బుల్లెట్ ఫ్రూప్‌ వాహనాల్లో భారీ భద్రత మధ్య ఎంపీల బృందం పర్యటించింది. పూర్తి బంద్ వాతావరణం, అక్కడక్కడ స్థానికులు ఆగ్రహంతో రాళ్లు రువ్విన దృశ్యాలు ఎంపీల బృందానికి స్వాగతం పలికాయి. అక్కడి నుంచి హోటల్‌కు చేరుకున్న ఎంపీలు అక్కడికి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. […]

మోడీ ప్రచార స్టంట్‌లో నేను భాగం కాలేను  ఇంగ్లండ్ ఎంపీ
X

జమ్ము కశ్మీర్‌లో స్థానిక పరిస్థితులను నేరుగా తెలుసుకునేందుకు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యుల బృందం అక్కడ పర్యటించింది. పూర్తిగా స్తంభించిన ప్రజా వ్యవస్థ నడుమ ఖాళీ వీధుల్లో వీరి పర్యటన సాగింది. బుల్లెట్ ఫ్రూప్‌ వాహనాల్లో భారీ భద్రత మధ్య ఎంపీల బృందం పర్యటించింది.

పూర్తి బంద్ వాతావరణం, అక్కడక్కడ స్థానికులు ఆగ్రహంతో రాళ్లు రువ్విన దృశ్యాలు ఎంపీల బృందానికి స్వాగతం పలికాయి. అక్కడి నుంచి హోటల్‌కు చేరుకున్న ఎంపీలు అక్కడికి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.

జమ్ము కశ్మీర్ పర్యటనకు వచ్చిన ఈయూ ఎంపీల బృందంలోని కొందరు సభ్యులు ఢిల్లీ నుంచే వెనక్కు వెళ్లిపోయారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా తాము పర్యటించేందుకు వీలు కల్పించడంతో పాటు, బలగాలు వెంట లేకుండా ఎక్కడైనా ఎవరితోనైనా తాము స్వేచ్చగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడం, అందుకు భారత ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతోనే ఈ ఎంపీలు ఢిల్లీ నుంచే వెనక్కు వెళ్లినట్టు చెబుతున్నారు.

కశ్మీర్‌లో తాము స్వేచ్చగా తిరుగుతూ అక్కడి ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు అవకాశం ఇస్తేనే పర్యటనకు వస్తానని తాను చెప్పడంతో… తనకు పంపిన ఆహ్వానాన్ని భారత ప్రభుత్వం ఉపసంహరించుకుందని వాయువ్య ఇంగ్లండ్ ఎంపీ క్రిస్ డేవీస్ వెల్లడించారు.

వాస్తవాలు బయటకు రాకుండా ఉంచేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని…. అందు వల్లే స్వేచ్చగా తిరిగేందుకు తమకు అనుమతి ఇవ్వలేదని డేవీస్ ఆరోపించారు. ఎంపీల బృందాన్ని కశ్మీర్‌కు తీసుకెళ్లడం మోడీ ప్రచార స్టంట్ అని … దీనిలో తాను భాగస్వామ్యం కాదలుచుకోలేదన్నారు. కశ్మీర్‌లో ప్రజాస్వామ్య సూత్రాలను పూర్తిగా తుంగలో తొక్కారన్నది స్పష్టంగా అర్థమవుతోందని ఇంగ్లండ్ ఎంపీ డేవీస్ వ్యాఖ్యానించారు.

First Published:  30 Oct 2019 1:15 AM IST
Next Story