కాలువలో దూకి చనిపోయిన కోడి పందెం రాయుళ్లు
ప్రకాశం జిల్లాలో విషాద ఘటన జరిగింది. పోలీసులను చూసి భయంతో పారిపోతూ కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరొకరు గల్లంతు అయ్యారు. గల్లంతయిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. చీరాల మండలం ఈపురుపాలెం వద్ద కోడిపందాలు ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. పోలీసులు రావడంతో హడలిపోయిన పందెం రాయుళ్లు పరుగులు తీశారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు వ్యక్తులు పక్కనే ఉన్న కాలువలోకి దూకేశారు. నీటి ఉధృతిలో కొట్టుకుపోయి మధు, శీను అనే వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. […]

ప్రకాశం జిల్లాలో విషాద ఘటన జరిగింది. పోలీసులను చూసి భయంతో పారిపోతూ కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరొకరు గల్లంతు అయ్యారు. గల్లంతయిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
చీరాల మండలం ఈపురుపాలెం వద్ద కోడిపందాలు ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు.
పోలీసులు రావడంతో హడలిపోయిన పందెం రాయుళ్లు పరుగులు తీశారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు వ్యక్తులు పక్కనే ఉన్న కాలువలోకి దూకేశారు. నీటి ఉధృతిలో కొట్టుకుపోయి మధు, శీను అనే వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గల్లంతు అయ్యాడు. మృతదేహాలను చీరాల ఆస్పత్రికి తరలించారు.