Telugu Global
NEWS

తెలివైన వాడిని అనుకుంటున్న చంద్రబాబే పెద్ద తెలివి తక్కువ మనిషి...

టీడీపీకి చెందిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు తనకు రాసిన లేఖపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చదరపు అడుగు నిర్మాణానికి రాజధానిలో 10వేలు ఖర్చు చేశారని తాను తొలి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి భారీగా ఖర్చు అవుతుంది అన్నది తాను ఎన్నిసార్లైనా చెబుతానన్నారు. ఇక్కడ చదరపు అడుగుకు పది వేలు ఖర్చు అవుతుంటే…. ఇప్పటికీ టీడీపీ నేతలు హైదరాబాద్‌, చెన్నైలో కంటే తక్కువ ఖర్చు అవుతుందంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. నోరు విప్పితే చంద్రబాబు, […]

తెలివైన వాడిని అనుకుంటున్న చంద్రబాబే పెద్ద తెలివి తక్కువ మనిషి...
X

టీడీపీకి చెందిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు తనకు రాసిన లేఖపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చదరపు అడుగు నిర్మాణానికి రాజధానిలో 10వేలు ఖర్చు చేశారని తాను తొలి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి భారీగా ఖర్చు అవుతుంది అన్నది తాను ఎన్నిసార్లైనా చెబుతానన్నారు. ఇక్కడ చదరపు అడుగుకు పది వేలు ఖర్చు అవుతుంటే…. ఇప్పటికీ టీడీపీ నేతలు హైదరాబాద్‌, చెన్నైలో కంటే తక్కువ ఖర్చు అవుతుందంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు.

నోరు విప్పితే చంద్రబాబు, టీడీపీ నేతలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని బొత్స విమర్శించారు. రాజధాని భూముల్లో భారీగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేశారని బొత్స ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే, అంత అనుభవం ఉంటే ఐదేళ్లలో రాజధానిలో శాశ్వితంగా ఒక్క నిర్మాణం కూడా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

రాజధాని భూముల్లో అనుచితంగా లబ్దిపొందిన వారిలో 90 శాతం మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని… అందుకే తాను ఒకే కులం వారు అని మాట్లాడానని…. అందులో తప్పేముందని బొత్స ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో జరిగిన దోపిడికి కారణమైన వారంతా చంద్రబాబు వర్గానికి చెందిన వారు, ఆయన బంధువులే ఉన్నారని బొత్స వివరించారు.

రాజధాని పేరుతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బడుగు బలహీన వర్గాల నుంచి భూములను ముందే లాగేసుకుని టీడీపీ నేతలు దోపిడికి తెగబడ్డారన్నారు. దోపిడి చేసిన వారి పేర్లను బయటపెడితే ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారంటే ఎలా అని ప్రశ్నించారు.

బాలకృష్ణ వియ్యంకుడికి 498 ఎకరాలు కేటాయించారని… అక్రమ మార్గంలో చేశారని…. అందుకే ఈ కేటాయింపును రద్దు చేసినట్టు బొత్స చెప్పారు.

ఎవరైతే తాను తెలివైన వాడిని అనుకుంటాడో వాడే అసలైన తెలివి తక్కువ వ్యక్తి అని బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు చర్యలు కూడా తాను మాత్రమే తెలివైన వాడిని అనుకుని చేస్తుంటారని.. కానీ ప్రజలెవరూ అమాయకులు కారని అన్నారు.

హైకోర్టు తిట్టింది గతంలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్నే అని బొత్స వ్యాఖ్యానించారు. టీ కూడా దొరకని చోట తమను తెచ్చి పడేశారని హైకోర్టు గత ప్రభుత్వంపై ఫైర్ అయిందన్నారు. ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైకోర్టు వ్యాఖ్యలను కూడా పట్టుకుని చంద్రబాబు సంకలు గుద్దుకుంటే ఎవరేం చేస్తారని ఎద్దేవా చేశారు.

First Published:  30 Oct 2019 4:20 PM IST
Next Story