Telugu Global
NEWS

బెదిరించి వసూళ్లకు పాల్పడడంతోనే ఆంధ్రజ్యోతి విలేకరిని చంపేశాం...

తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో ఈనెల 15న ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్యకు గురయ్యాడు. కాతా సత్యనారాయణ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వారి ప్రత్యర్థులపై వ్యతిరేక కథనాలు రాసేవాడు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ హత్య జరగడంతో అతడి సోదరుడితో పాటు, టీడీపీ నేతలు ఈ హత్య వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేయించారంటూ ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు … విలేకరి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదులోని వ్యక్తులను […]

బెదిరించి వసూళ్లకు పాల్పడడంతోనే ఆంధ్రజ్యోతి విలేకరిని చంపేశాం...
X

తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో ఈనెల 15న ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్యకు గురయ్యాడు. కాతా సత్యనారాయణ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వారి ప్రత్యర్థులపై వ్యతిరేక కథనాలు రాసేవాడు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ హత్య జరగడంతో అతడి సోదరుడితో పాటు, టీడీపీ నేతలు ఈ హత్య వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేయించారంటూ ఫిర్యాదు చేశారు.

కాతా సత్యనారాయణ

కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు … విలేకరి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదులోని వ్యక్తులను విచారించారు. కానీ వారు హత్య చేయలేదని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఇతరులపై దృష్టి సారించారు. ఈ ప్రయత్నంలోనే అసలు హంతకులు గౌరి వెంకటరమణ, దొరబాబు, తాతాజీ అనే వ్యక్తులు విలేకరి సత్యనారాయణను హత్య చేసినట్టు తేలిందని జిల్లా ఎస్పీ నయూం అస్మి వివరించారు.

ఈ కేసులో హంతకులను పట్టుకునేందుకు దాదాపు లక్ష ఫోన్ కాల్స్‌ను పరిశీలించామని ఎస్పీ వెల్లడించారు. నిందితులు గౌరి వెంకటరమణ, దొరబాబులకున్న వ్యక్తిగత బలహీనతలను ఆధారంగా చేసుకుని విలేకరి సత్యనారాయణ బ్లాక్‌మెయిల్ చేసినట్టు విచారణలో తేలింది.

తనకున్న రాజకీయ పలుకుబడితో గౌరి, దొరబాబును కేసుల్లో ఇరికిస్తానంటూ బెదరించి… విలేకరి సత్యనారాయణ లక్షల రూపాయలు వసూలు చేశాడు. గౌరి వెంకటరమణ ఇప్పటికే రెండు లక్షల రూపాయలు సత్యనారాయణకు చెల్లించాడు. అయినప్పటికీ పదేపదే బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో భరించలేక హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు.

విలేకరి నుంచి బ్లాక్‌మెయిల్‌కు గురైన గౌరి వెంకటరమణ, దొరబాబుకు వారి స్నేహితులు మరికొందరు సహకరించారు. ఆరుగురు కలిసి ఈనెల 15న కాతా సత్యనారాయణను హత్య చేశారు.

హంతకులు ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు… వారి నుంచి హత్యకు వాడిన కత్తి, నాలుగు ఇనుప రాడ్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.

First Published:  30 Oct 2019 3:24 AM IST
Next Story