సబ్ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి ఇరుక్కున్న డీఎస్పీ , సీఐ
విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను అవినీతి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన ఏసీబీ డీఎస్పీ, సీఐల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈనెల 9న మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ ఎలాంటి అవినీతి సొమ్ము దొరకలేదు. దీంతో అసహనం చెందిన ఏసీబీ డీఎస్పీ రంగరాజు, సీఐ గఫూర్ కొత్త కుట్రకు తెరలేపారు. సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను అక్కడే కూర్చోబెట్టి ఆఫీస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డబ్బు దొరక్కపోవడంతో […]
విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను అవినీతి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన ఏసీబీ డీఎస్పీ, సీఐల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈనెల 9న మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ ఎలాంటి అవినీతి సొమ్ము దొరకలేదు. దీంతో అసహనం చెందిన ఏసీబీ డీఎస్పీ రంగరాజు, సీఐ గఫూర్ కొత్త కుట్రకు తెరలేపారు.
సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను అక్కడే కూర్చోబెట్టి ఆఫీస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డబ్బు దొరక్కపోవడంతో ఎలాగైనా కేసుల్లో సబ్ రిజిస్ట్రార్‌ను ఇరికించాలన్న ఆలోచనతో అప్పటికప్పుడు సీఐ గపూర్ బయటకు వెళ్లి 61వేల రూపాయలు తెచ్చాడు. దాన్ని తీసుకెళ్లి సబ్ రిజిస్ట్రార్ గదిలోని రికార్డుల్లో పెట్టాడు.
ఆ డబ్బును చూపించి కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ ఒత్తిడితో సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను మధురవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేశారు. కానీ ఏసీబీ కుట్ర మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సీఐ గపూర్ బయటి నుంచి డబ్బులు తెచ్చి వాటిని రికార్డుల్లో ఉంచిన విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఫుటేజ్‌ను తీసుకుని తారకేష్ నేరుగా రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను కలిశారు.
ఫుటేజ్‌ను వీక్షించిన మంత్రి తక్షణం ఏసీబీ డీఎస్పీ రంగరావు, సీఐ గఫూర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. నిజానిజాలు పరీశీలన చేయకుండా ఏసీబీ ఒత్తిడికి లొంగి సబ్ రిజిస్ట్రార్‌ను బదిలీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ విశాఖ డీఐజీని సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.