Telugu Global
NEWS

టోక్యో ఒలింపిక్స్ హాకీలో చోటు లేని పాక్

అర్హత పోటీలో పాక్ కు డచ్ షాక్ ఒలింపిక్స్ హాకీలో మూడుసార్లు విజేత పాక్ జట్టు…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యింది. ఆమ్‌స్టర్ డామ్ వేదికగా జరిగిన అర్హత పోటీలో…నెదర్లాండ్స్ డబుల్ హెడర్ లో 10-5 గోల్స్ తేడాతో పాక్ ను కంగు తినిపించింది. నిబంధనల ప్రకారం ఒలింపిక్స్ అర్హత కోసం…ప్రత్యర్థితో ఒక్కో జట్టు రెండుసార్లు తలపడాల్సి ఉంది. పాక్- డచ్ జట్ల తొలిమ్యాచ్ లో రెండుజట్లు చెరో 4 గోల్స్ చేయడంతో.. 4-4తో […]

టోక్యో ఒలింపిక్స్ హాకీలో చోటు లేని పాక్
X
  • అర్హత పోటీలో పాక్ కు డచ్ షాక్

ఒలింపిక్స్ హాకీలో మూడుసార్లు విజేత పాక్ జట్టు…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యింది. ఆమ్‌స్టర్ డామ్ వేదికగా జరిగిన అర్హత పోటీలో…నెదర్లాండ్స్ డబుల్ హెడర్ లో 10-5 గోల్స్ తేడాతో పాక్ ను కంగు తినిపించింది.

నిబంధనల ప్రకారం ఒలింపిక్స్ అర్హత కోసం…ప్రత్యర్థితో ఒక్కో జట్టు రెండుసార్లు తలపడాల్సి ఉంది. పాక్- డచ్ జట్ల తొలిమ్యాచ్ లో రెండుజట్లు చెరో 4 గోల్స్ చేయడంతో.. 4-4తో పోటీ డ్రాగా ముగిసింది.

రెండోమ్యాచ్ లో మాత్రం నెదర్లాండ్స్ 6-1 గోల్స్ తో పాక్ ను చిత్తు చేయడం ద్వారా…ఓవరాల్ గా 10-5 గోల్స్ తేడాతో నెగ్గినట్లయ్యింది.

పాక్ హాకీ చరిత్రలో ఇది దురదృష్టకరమైన రోజని..పాక్ టీమ్ మేనేజర్ రషీద్ మహ్మద్ వ్యాఖ్యానించారు.

1960, 1968, 1984 ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించిన పాక్ జట్టు…చివరిసారిగా 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో మాత్రమే కాంస్యపతకం సంపాదించింది.

ఆ తర్వాత నుంచి పాక్ హాకీ ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయి. చివరకు ఒలింపిక్స్ కు సైతం అర్హత సాధించలేని దుస్థితిలో పడిపోయింది.

First Published:  29 Oct 2019 1:28 AM IST
Next Story