Telugu Global
National

కాంగ్రెస్, ఎస్పీపీలతో కలవడానికైనా సిద్ధం అంటున్న శివసేన

మహారాష్ట్రలో మిత్రపక్షాలు బీజేపీ-శివసేన కలిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సొంతంగా ఏపార్టీకి పూర్తి స్థాయి సీట్లు రాలేదు. బీజేపీకి మెజార్టీకంటే తక్కువ సీట్లు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో శివసేన ఇదే అదునుగా తన కోర్కెల చిట్టాను బయటకు తీస్తోంది. డిమాండ్లపై మాత్రం వెనక్కితగ్గడం లేదు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా రెండున్నరేళ్ల పాటు సీఎం కుర్చీ తమకు కట్టబెట్టాలని బీజేపీకి శివసేన అల్టీమేటం జారీ చేసిందట.. శనివారం బీజేపీ […]

కాంగ్రెస్, ఎస్పీపీలతో కలవడానికైనా సిద్ధం అంటున్న శివసేన
X

మహారాష్ట్రలో మిత్రపక్షాలు బీజేపీ-శివసేన కలిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సొంతంగా ఏపార్టీకి పూర్తి స్థాయి సీట్లు రాలేదు. బీజేపీకి మెజార్టీకంటే తక్కువ సీట్లు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో శివసేన ఇదే అదునుగా తన కోర్కెల చిట్టాను బయటకు తీస్తోంది. డిమాండ్లపై మాత్రం వెనక్కితగ్గడం లేదు.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా రెండున్నరేళ్ల పాటు సీఎం కుర్చీ తమకు కట్టబెట్టాలని బీజేపీకి శివసేన అల్టీమేటం జారీ చేసిందట.. శనివారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఈ మేరకు ప్రతిపాదనను ఇచ్చినట్టు సమాచారం.

అయితే బీజేపీ మాత్రం శివసేనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని చెబుతోంది. కానీ దీనికి శివసేన అంగీకరించే పరిస్థితి లేదు. శివసేన యువ కెరటం.. థాకరేల వారసుడు ఆదిత్య థాకరేను మహారాష్ట్ర సీఎంగా చూడాలని పట్టుదలతో ఉన్న శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే ఈ మేరకు బీజేపీకి సగం సగం కుర్చీ పంచుకుందామని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇక ఒకవేళ బీజేపీ కనుక ఈ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాకు ఒప్పుకోకపోతే ఇతర మార్గాలను అన్వేషిస్తామని బీజేపీకి శివసేన అల్టీమేటం జారీ చేసింది. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. సీఎం కుర్చీని తీసుకుంటామని శివసేన బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నట్టు తెలిసింది.

అయితే శివసేన కంటే రెండింతలు సీట్లు వచ్చాయని.. శివసేనతో కలిసి సీఎం కుర్చీ పంచుకునే ప్రసక్తే లేదని మహారాష్ట్ర బీజేపీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. దీంతో మహారాష్ట్రలో అధికారం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.

First Published:  28 Oct 2019 9:59 AM IST
Next Story