బాబాయ్ సినిమా కథలు వింటున్నారు " రాంచరణ్
మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో పాటు… పార్టీ పరంగానూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వస్తారా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం పట్ల సానుకూలంగా మాట్లాడుతూ వచ్చిన పవన్ కల్యాణ్…. జగన్ ప్రభుత్వంపై మాత్రం తొలిరోజు నుంచే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ప్రశ్నించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఇలాంటప్పుడు పవన్ కల్యాణ్ సినిమాల్లోకి […]
మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో పాటు… పార్టీ పరంగానూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వస్తారా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం పట్ల సానుకూలంగా మాట్లాడుతూ వచ్చిన పవన్ కల్యాణ్…. జగన్ ప్రభుత్వంపై మాత్రం తొలిరోజు నుంచే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ప్రశ్నించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఇలాంటప్పుడు పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వాస్తారా? రారా? అన్నదానిపై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి.
ఈ అంశంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రాంచరణ్… తన బాబాయి పవన్ కల్యాణ్ ప్రస్తుతం పలు సినిమా కథలు వింటున్నారని చెప్పారు. ప్రస్తుతానికి ఇంకా ఏ చిత్రాన్ని పవన్ కల్యాణ్ అంగీకరించలేదని… కథలు మాత్రం వింటున్నారని రాంచరణ్ వివరించారు. సినిమాల్లో తిరిగి నటించడంపై పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు.
దక్షిణాది నటులను తక్కువ చేసి చూడవద్దంటూ ప్రధాని మోడీకి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తనకు చాలా ఆలస్యంగా తెలిసిందన్నారు. దీనిపై ఆమెను అడగ్గా… ముందే చెబితే మీరు వద్దంటారనే చెప్పకుండా ట్వీట్ చేశా అని వివరించిందన్నారు.
సైరా సినిమా విజయం గర్వంగా ఉందని … వసూళ్ల పరంగా రంగస్థలం సినిమాని దాటి… బాహుబలికి దగ్గరగా సైరా వెళ్లిందని రాంచరణ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరాను తమ బ్యానర్ నుంచి పరిచయం చేయాల్సి వస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతానని రాంచరణ్ చెప్పారు. అకీరా ఎప్పుడు సినిమాల్లోకి వస్తానంటే అప్పుడు తాము సిద్ధమేనని చెప్పారు.