ఆస్పత్రికి వైద్యుల డుమ్మా... వైద్యం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఆస్పత్రిలో పరిస్థితులను పరిశీలించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన వైసీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి షాక్ అయ్యారు. ఉదయం 11 గంటలు దాటినా డాక్టర్లు ఒక్కరు కూడా ఆస్పత్రికి రాలేదు. జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రిలో ఈ పరిస్థితిని చూసి ఎమ్మెల్యే అవాక్కయ్యారు. అక్కడి రోగులతో మాట్లాడారు. డాక్టర్లు ఇలా డమ్మా కొట్టడం, ఆలస్యంగా రావడం ఇక్కడ మామూలేనని అక్కడి వారు సమాధానం ఇచ్చారు. అప్పటికే వైద్యుల కోసం చాలా మంది పేషెంట్లు ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతో […]
ఆస్పత్రిలో పరిస్థితులను పరిశీలించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన వైసీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి షాక్ అయ్యారు. ఉదయం 11 గంటలు దాటినా డాక్టర్లు ఒక్కరు కూడా ఆస్పత్రికి రాలేదు. జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రిలో ఈ పరిస్థితిని చూసి ఎమ్మెల్యే అవాక్కయ్యారు. అక్కడి రోగులతో మాట్లాడారు.
డాక్టర్లు ఇలా డమ్మా కొట్టడం, ఆలస్యంగా రావడం ఇక్కడ మామూలేనని అక్కడి వారు సమాధానం ఇచ్చారు. అప్పటికే వైద్యుల కోసం చాలా మంది పేషెంట్లు ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతో స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే… రోగులను పరిశీలించారు. వారికి పరీక్షలు చేశారు. మందులు రాశారు. ఇంజెక్షన్‌లు వేశారు.
అలా పేషెంట్లకు చాలా సేపు వైద్యం చేస్తూ ఎమ్మెల్యే ఆసుపత్రిలోనే గడిపినా…. డాక్టర్లు మాత్రం అటువైపు రాలేదు. పరిస్థితిని వైద్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే చెప్పారు.