నాన్నే నా సూపర్ హీరో " కొహ్లీ
నాన్న లేని నేను లేను అంటున్న విరాట్ విరాట్ కొహ్లీ…ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. అంతేకాదు…ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మన్. భారత్ అత్యంత విజయవంతమైన బ్యాట్స్ మన్. కేవలం క్రికెటర్ గానే వందల కోట్ల రూపాయలు ఆర్జించిన, ఆర్జిస్తున్న మొనగాడు. అవార్డులు, రివార్డులు ఎన్నో ఎన్నెన్నో సాధించిన ఘనుడు. అయినా ఓ నాన్నకు కొడుకే. ఒక్కమాటలో చెప్పాలంటే..నాన్న దిద్దిన బొమ్మే తానని 30 ఏళ్ల విరాట్ కొహ్లీ గర్వంగా, చెమర్చే కళ్లతో తరచూ […]
![నాన్నే నా సూపర్ హీరో కొహ్లీ నాన్నే నా సూపర్ హీరో కొహ్లీ](https://www.teluguglobal.com/h-upload/old_images/120719-virat-kohli-father.webp)
- నాన్న లేని నేను లేను అంటున్న విరాట్
విరాట్ కొహ్లీ…ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. అంతేకాదు…ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మన్. భారత్ అత్యంత విజయవంతమైన బ్యాట్స్ మన్. కేవలం క్రికెటర్ గానే వందల కోట్ల రూపాయలు ఆర్జించిన, ఆర్జిస్తున్న మొనగాడు. అవార్డులు, రివార్డులు ఎన్నో ఎన్నెన్నో సాధించిన ఘనుడు. అయినా ఓ నాన్నకు కొడుకే.
ఒక్కమాటలో చెప్పాలంటే..నాన్న దిద్దిన బొమ్మే తానని 30 ఏళ్ల విరాట్ కొహ్లీ గర్వంగా, చెమర్చే కళ్లతో తరచూ గుర్తు
చేసుకొంటూ ఉంటాడు.
విరాట్ హీరోగా సూపర్-వీ పేరుతో నవంబర్ 5న మార్కెట్లోకి ఓ యానిమేటెడ్ సిరీస్ విడుదల కానుంది. ఈ సిరీస్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కొహ్లీ.. ఒక్కసారిగా తన తండ్రిని గుర్తు చేసుకొన్నాడు. ప్రస్తుతం తాను ఈ స్థితిలో ఉన్నానంటే..అంతా నాన్న చలువేనని…నాన్న లేకుంటే తాను లేనని చెప్పాడు.
తన ఉన్నతి కోసం తండ్రి పడినపాట్లు, చేసిన త్యాగం తాను మరువలేనని…తన భవిష్యత్ కోసం ఆయన చేయాల్సిందంతా చేసి వెళ్లారని గుర్తు చేసుకొన్నాడు.
తన వ్యక్తి్త్వం, క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడే తత్వం, ఎదుటివారిని గౌరవించడం లాంటి లక్షణాలు తన తండ్రి నుంచే వచ్చాయని…ఆయన చూపిన దారిలో ప్రయాణం చేసి తాను ఇంతటి వాడినయ్యానని..తన ఈ ఉన్నతి వెనుక ఎందరు ఉన్నా… నాన్న తర్వాతే ఎవరైనా అని విరాట్ ప్రకటించాడు.
గుండెపోటుతో తండ్రి మృతి చెందిన రోజునే తాను గుండెనిండా భారం నింపుకొని, అంతులేని విషాదంతో.. క్రికెట్ మ్యాచ్ ఆడి ఢిల్లీని గెలిపించిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని వివరించాడు. తనవరకూ నాన్నే సూపర్ హీరో అని తెలిపాడు.