వంశీ రాజీనామా... వైసీపీ నేతలపై లేఖలో ఆరోపణలు
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబునాయుడికి పంపించారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు వంశీ ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని వంశీ కలవడంతో ఆయన వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం బాగా సాగింది. కానీ రాజీనామా లేఖలో వంశీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వైసీపీలో చేరడం అనుమానంగానే కనిపిస్తోంది. స్థానిక వైసీపీ నాయకత్వం నుంచే కాకుండా… అధికారుల నుంచి తన అనుచరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వంశీ […]
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబునాయుడికి పంపించారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు వంశీ ప్రకటించారు.
ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని వంశీ కలవడంతో ఆయన వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం బాగా సాగింది. కానీ రాజీనామా లేఖలో వంశీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వైసీపీలో చేరడం అనుమానంగానే కనిపిస్తోంది.
స్థానిక వైసీపీ నాయకత్వం నుంచే కాకుండా… అధికారుల నుంచి తన అనుచరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వంశీ లేఖలో వివరించారు. తన అనుచరుల ఇబ్బందులు తొలగించేందుకు వేరే వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉన్నా…. తన మనస్సాక్షి అందుకు అంగీకరించడం లేదని వంశీ చెబుతున్నారు.
అందుకే అనవసర శతృత్వం వద్దనుకుని పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అంటూ…. చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ రాశారు.
ఒకవేళ వైసీపీలో చేరే ఉద్దేశమే వంశీకి ఉండిఉంటే ఇలా వైసీపీ నాయకులపైనా, అధికారులపైనా ఆరోపణలు చేయకుండా ఉండేవారు. పైగా గన్నవరంలో వంశీ రాకను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు పెద్దెత్తున నిరసన తెలుపుతున్నాయి.
ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వేలాది మందికి నకిలీ ఇళ్ల పట్టాలను పంచిపెట్టాడు వంశీ. అవన్నీ ఫేక్ పట్టాలని తేలడంతో ఇటీవల కేసు కూడా నమోదు చేశారు.
కానీ ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకే గుడ్‌బై చెప్పేంతగా వంశీ పై ఒత్తిడి ఉందా అన్నది అనుమానమే. దీని వెనుక ఎదో ఒక పెద్ద కారణమే ఉండి ఉంటుంది.