Telugu Global
NEWS

103 టైటిల్ కు చేరువగా ఫెదరర్

1500 మ్యాచ్ ల ఒకే ఒక్కడు ఫెదరర్ ప్రపంచ టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్ తన కెరియర్ లో 103వ సింగిల్స్ టైటిల్ కు చేరువయ్యాడు. 2019 సీజన్లో 50వ విజయం సాధించడం ద్వారా.. స్విస్ ఇండోర్ టెన్నిస్ టోర్నీ టైటిల్ సమరానికి అర్హత సాధించాడు. 1500 మ్యాచ్ ల ఫెదరర్… టెన్నిస్ ఆడటమే ఊపిరిగా భావించే 38 ఏళ్ల ఫెదరర్..1500 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా, ఒకేఒక్కడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. స్విస్ […]

103 టైటిల్ కు చేరువగా ఫెదరర్
X
  • 1500 మ్యాచ్ ల ఒకే ఒక్కడు ఫెదరర్

ప్రపంచ టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్ తన కెరియర్ లో 103వ సింగిల్స్ టైటిల్ కు చేరువయ్యాడు. 2019 సీజన్లో 50వ విజయం సాధించడం ద్వారా.. స్విస్ ఇండోర్ టెన్నిస్ టోర్నీ టైటిల్ సమరానికి అర్హత సాధించాడు.

1500 మ్యాచ్ ల ఫెదరర్…

టెన్నిస్ ఆడటమే ఊపిరిగా భావించే 38 ఏళ్ల ఫెదరర్..1500 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా, ఒకేఒక్కడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

స్విస్ ఇన్ డోర్స్ టోర్నీలో 15వసారి పాల్గొంటున్న ఫెదరర్ వరుసగా 13వసారి ఫైనల్స్ కు అర్హత సంపాదించాడు. బాసెల్ వేదికగా జరుగుతున్న ఈ టో్ర్నీ సెమీఫైనల్లో 6-4, 6-4తో స్టెఫానోస్ సిటిస్ పాస్ ను చిత్తు చేశాడు.

టైటిల్ సమరంలో అలెక్స్ డి మినోర్ తో ఫెదరర్ తలపడనున్నాడు. తన కెరియర్ లో 10వసారి స్విస్ ఇన్ డోర్స్ ఫైనల్స్ ఆడుతున్న టాప్ సీడ్ ఫెదరర్..10వసారి విజేతగా నిలవడానికి సిద్ధమయ్యాడు.

38 సంవత్సరాల రోజర్ ఫెదరర్ కు 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా…మొత్తం 102 ఏటీపీ టూర్ టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డు ఉంది. బాసెల్ టూర్ టోర్నీని ఇప్పటికే తొమ్మిదిసార్లు నెగ్గిన ఫెదరర్ పదోసారి టైటిల్ కు గురిపెట్టాడు.

ఇప్పటికే సీజన్ ముగింపు ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించిన ఫెదరర్…2019 సీజన్లో 50 విజయాలు, 8 పరాజయాల రికార్డుతో నిలిచాడు.

రఫా నుంచి తనకు ఆహ్వానం అందలేదని…అతను ఆహ్వానిస్తాడని తాను ఆశించలేదని కూడా ఫెదరర్ తెలిపాడు.

First Published:  27 Oct 2019 3:21 AM IST
Next Story