Telugu Global
NEWS

టీ-20 సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాకు దెబ్బ

భారత పర్యటనకు తమీమ్ దూరం నవంబర్ 3 నుంచి తీన్మార్ టీ-20 సిరీస్ ప్రపంచకప్ కు సన్నాహాకంగా నవంబర్ 3 నుంచి భారత్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ కు గట్టి దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ టాపార్డర్లో కీలక ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్…వ్యక్తిగత కారణాలతో భారత్ తో సిరీస్ కు అందుబాటులో ఉండబోనని ప్రకటించాడు. దీంతో బంగ్లా క్రికెట్ బోర్డు తమీమ్ స్థానంలో…ఇమ్రుల్ ఖైస్ కు తుదిజట్టులో చోటు […]

టీ-20 సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాకు దెబ్బ
X
  • భారత పర్యటనకు తమీమ్ దూరం
  • నవంబర్ 3 నుంచి తీన్మార్ టీ-20 సిరీస్

ప్రపంచకప్ కు సన్నాహాకంగా నవంబర్ 3 నుంచి భారత్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ కు గట్టి దెబ్బ తగిలింది.

బంగ్లాదేశ్ టాపార్డర్లో కీలక ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్…వ్యక్తిగత కారణాలతో భారత్ తో సిరీస్ కు అందుబాటులో ఉండబోనని ప్రకటించాడు.

దీంతో బంగ్లా క్రికెట్ బోర్డు తమీమ్ స్థానంలో…ఇమ్రుల్ ఖైస్ కు తుదిజట్టులో చోటు కల్పించినట్లు తెలిపింది.

డాషింగ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ నాయకత్వంలోని బంగ్లా జట్టులో…లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ఇమ్రుల్ ఖైస్, ముష్ ఫికుర్ రహీం, మహ్మద్ నైమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం, మొసాదిక్ హుస్సేన్, అరాఫత్ సన్నీ, అల్ అమీన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షైఫుల్ ఇస్లాం సభ్యులుగా ఉన్నారు.

నవంబర్ 3న ప్రారంభమయ్యే మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలి టీ-20 న్యూఢిల్లీ ఫిరోజ్ షా కో్ట్లా వేదికగా జరుగుతుంది. నవంబర్ 14 నుంచి 26 వరకూ జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఇండోర్, కోల్ కతా వేదికలు కానున్నాయి.

First Published:  27 Oct 2019 2:20 AM IST
Next Story