"వాడి కార్యకర్తల కోసం వాడు వస్తే మా పరిస్థితి ఏంటి?" " యార్లగడ్డ వెంకట్రావ్
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో గన్నవరం వైసీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా స్పందించారు. తనది గన్నవరం నియోజకవర్గం కాకపోయినా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో అక్కడికి వెళ్లి పనిచేశానని… గడపగడపకు తిరిగానన్నారు. వంశీ వైసీపీలోకి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో రాత్రి నుంచి వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని వెంకట్రావ్ వివరించారు. వంశీ అనే వాడి వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని… వైసీపీ కార్యకర్తలపై నియోజకవర్గంలో 4వేల కేసులు టీడీపీ హయాంలో […]
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో గన్నవరం వైసీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా స్పందించారు.
తనది గన్నవరం నియోజకవర్గం కాకపోయినా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో అక్కడికి వెళ్లి పనిచేశానని… గడపగడపకు తిరిగానన్నారు. వంశీ వైసీపీలోకి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో రాత్రి నుంచి వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని వెంకట్రావ్ వివరించారు.
వంశీ అనే వాడి వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని… వైసీపీ కార్యకర్తలపై నియోజకవర్గంలో 4వేల కేసులు టీడీపీ హయాంలో నమోదు చేశారన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వారిపై ఒక్క కేసు కూడా తాము పెట్టలేదన్నారు.
”వాడి కార్యకర్తలను కాపాడుకోవడానికి వాడు పార్టీలోకి వస్తుంటే… మా పరిస్థితి ఏమిటి అని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు” అని వెంకట్రావ్ చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాతే ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పందిస్తానన్నారు.
మిమ్మల్ని పార్టీలోకి తెచ్చిన కొడాలి నానినే ఇప్పుడు వంశీని తీసుకురావడాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించగా… ఆ విషయం కొడాలి నానినే అడగాలని… నానితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
తాను ఓడిపోయిన వెంటనే తనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించారని… వంశీ వస్తున్నాడు కాబట్టి తనకు ఏదో పదవి ఇస్తారని తాను అనుకోవడం లేదన్నారు. పదవికి, వంశీ రాకకు సంబంధం లేదన్నారు.
ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు టీడీపీనే గెలిచిందని… ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది సౌమ్యులేనని… కానీ వంశీ వచ్చిన తర్వాతే ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు.