త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్
ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది అల వైకుంఠపురములో సినిమా. బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ అయింది. అది కాస్తా నంబర్ వన్ సాంగ్ గా వైరల్ అయిపోయింది. ఇక రెండో పాటకు సంబంధించి ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు. దీపావళికి ఆ సాంగ్ కూడా రాబోతోంది. ఇప్పుడు వీటికి తోడు సినిమా టీజర్ కూడా సిద్ధమైంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 7న అల వైకుంఠపురములో సినిమా టీజర్ […]

ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది అల వైకుంఠపురములో సినిమా. బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ అయింది. అది కాస్తా నంబర్ వన్ సాంగ్ గా వైరల్ అయిపోయింది. ఇక రెండో పాటకు సంబంధించి ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు. దీపావళికి ఆ సాంగ్ కూడా రాబోతోంది. ఇప్పుడు వీటికి తోడు సినిమా టీజర్ కూడా సిద్ధమైంది.
అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 7న అల వైకుంఠపురములో సినిమా టీజర్ విడుదలకాబోతోంది. ఆరోజు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే సంక్రాంతికి విడుదల అనుకొని, ఇంత త్వరగా టీజర్ రిలీజ్ చేస్తే హైప్ తగ్గిపోతుందని కూడా ఓ వాదన వినిపిస్తోంది. ఆ టైమ్ కు కావాలంటే మరో టీజర్ రిలీజ్ చేయొచ్చని, ఈసారి మాత్రం ఇదే ఊపును కొనసాగించాలని యూనిట్ దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
హారిక-హాసిని ఎంటర్ టైన్ మెంట్స్, గీతాఆర్ట్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.