Telugu Global
NEWS

హైకోర్టు వద్ద టాయిలెట్లు లేక చెట్ల పొదల్లోకి వెళ్తున్నారు... సిగ్గుందా చంద్రబాబు ?

ఢిల్లీలో చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షకు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని… ఆ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ నేత వర్లరామయ్య విసిరిన సవాల్‌కు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు స్పందించారు. వర్ల రామయ్య సవాల్‌కు తాము సిద్దమని ప్రకటించారు. చంద్రబాబునాయుడు చేసిన ధర్మపోరాట దీక్షకు 10 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నేరుగా జీవో ఇచ్చారని సదరు జీవోను సుధాకర్ బాబు మీడియా సమావేశంలో చూపించారు. 10 కోట్లు విడుదల […]

హైకోర్టు వద్ద టాయిలెట్లు లేక చెట్ల పొదల్లోకి వెళ్తున్నారు... సిగ్గుందా చంద్రబాబు ?
X

ఢిల్లీలో చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షకు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని… ఆ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ నేత వర్లరామయ్య విసిరిన సవాల్‌కు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు స్పందించారు. వర్ల రామయ్య సవాల్‌కు తాము సిద్దమని ప్రకటించారు.

చంద్రబాబునాయుడు చేసిన ధర్మపోరాట దీక్షకు 10 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నేరుగా జీవో ఇచ్చారని సదరు జీవోను సుధాకర్ బాబు మీడియా సమావేశంలో చూపించారు. 10 కోట్లు విడుదల చేస్తూ అధికారికంగా జీవోనే ఇచ్చి ఇప్పుడు మాత్రం కోటి మాత్రమే ఖర్చు అయిందంటూ పచ్చి అబద్దాలు చెబుతారా అని నిలదీశారు.

వర్ల రామయ్య ఇంటి వద్దే చర్చకు తాను సిద్ధమని సుధాకర్ బాబు చెప్పారు. దీక్షకు 10 కోట్లు ఖర్చు చేసినట్టు నిరూపిస్తే చంద్రబాబు, వర్ల రామయ్య రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. నిరూపించలేకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సుధాకర్ ప్రకటించారు.

ధర్మపోరాట దీక్షల సమయంలో ఒక్కో జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసి ఆ తర్వాత ఆ ఖర్చును ఒక్కో జిల్లాకు మూడు కోట్లుగా చూపించారన్నారు. మొత్తం ధర్మపోరాట దీక్షలకు రూ. 49 కోట్లు ఖర్చు చేశారని వివరించారు.

దీక్ష శిబిరంలో మొత్తం టీడీపీ పోస్టర్లను పెట్టి… ఏసీలు, పరుపులు వేసుకుని దీక్షలు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేశారన్నారు. ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్దాలు వర్లడం వర్ల రామయ్య మానుకోవాలన్నారు.

హైకోర్టు వద్ద కనీసం టీ క్యాంటీన్ కూడా లేని విధంగా నిర్మాణం చేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. హైకోర్టు వద్ద టాయిలెట్లు కూడా లేక అనేక మంది లాయర్లు చెట్ల పొదల్లోకి వెళ్తున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు.

ఈ పరిస్థితిని చూసి చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఐదేళ్లలో ఒక్క రోడ్డును కూడా రాజధానిలో ఎందుకు వేయలేదో చంద్రబాబు సమాధానం ఇవ్వాలన్నారు.

First Published:  26 Oct 2019 12:06 PM IST
Next Story