Telugu Global
National

హర్యానా ఎన్నికల్లో క్రీడాకారులకు మిశ్రమఫలితాలు

బీజెపీ టికెట్ పై ఓడిన యోగేశ్వర్ దత్, బబితా పోగట్ హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ విజయం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ తరపున బరిలో నిలిచిన ఇద్దరు వస్తాదులూ మట్టికరిచారు. అయితే భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ మాత్రం విజేతగా నిలిచాడు. చర్కీ దాద్రీ నియోజకవర్గం నుంచి బీజెపీ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ మహిళా వస్తాదు బబితా పోగట్ కు చుక్కెదురయ్యింది. అంతేకాదు…ఒలింపిక్స్ కాంస్యవిజేత యోగేశ్వర్ దత్ కు సైతం…బరోడా శాసనసభా […]

హర్యానా ఎన్నికల్లో క్రీడాకారులకు మిశ్రమఫలితాలు
X
  • బీజెపీ టికెట్ పై ఓడిన యోగేశ్వర్ దత్, బబితా పోగట్
  • హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ విజయం

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ తరపున బరిలో నిలిచిన ఇద్దరు వస్తాదులూ మట్టికరిచారు. అయితే భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ మాత్రం విజేతగా నిలిచాడు.

చర్కీ దాద్రీ నియోజకవర్గం నుంచి బీజెపీ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ మహిళా వస్తాదు బబితా పోగట్ కు చుక్కెదురయ్యింది. అంతేకాదు…ఒలింపిక్స్ కాంస్యవిజేత యోగేశ్వర్ దత్ కు సైతం…బరోడా శాసనసభా స్థానంలో పరాజయం తప్పలేదు.

పెహోవా స్థానం నుంచి బరిలో నిలిచిన భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్…5వేల 314 ఓట్ల తేడాతో…కాంగ్రెస్ అభ్యర్థి మన్ దీప్ సింగ్ పై విజయం సాధించాడు.

దాద్రీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన సోమ్ బీర్ సాంగ్వాన్…బీజెపీ అధికార అభ్యర్థి బబిత పోగట్ ను చిత్తు చేశాడు.

బరోడా స్థానం నుంచి బీజెపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన 2012 ఒలింపిక్స్ కాంస్య విజేత యోగేశ్వర్ దత్ ను కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ హుడా 4 వేల ఓట్ల తేడాతో మట్టి కరపించారు.

యోగేశ్వర్ దత్ లబోదిబో…

ప్రస్తుతం హర్యానా ప్రభుత్వంలో డీఎస్పీ ఉద్యోగిగా ఉన్న తాను…ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాలలోకి వచ్చానని, తనను ఇంతగా ప్రోత్సహించిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని వస్తే ఓటమి ఎదురయ్యిందని వాపోయాడు.

బీజెపీ జాతీయవాదం, పాక్ ఉగ్రవాదులపై మెరుపుదాడులు చూసి తాను రాజకీయాలలోకి వచ్చానని యోగేశ్వర్ దత్ తెలిపాడు.

మొత్తం మీద…కుస్తీ బరిలో ఎన్నో విజయాలు సాధించిన హర్యానా వస్తాదులు బబితా పోగట్, యోగేశ్వర్ దత్ లకు…బీజెపీ టికెట్లు దక్కినా ఎన్నికల బరిలో మాత్రం పరాజయాలు తప్పలేదు.

First Published:  26 Oct 2019 2:50 AM IST
Next Story