Telugu Global
NEWS

జీవోల జారీలో దూకుడుకు జగన్‌ కొత్త నిర్ణయం

జీవోల జారీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. ప్రాధాన్యత ఆధారంగా జీవోల జారీని మూడు కేటగిరీలుగా విభజించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలులో జాప్యం తగ్గించే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని ఫాలో కాబోతున్నారు. జీవోలను మూడు రకాలుగా విభజిస్తూ వాటి విడుదలకు కాలపరిమితిని ప్రకటించింది. అవుట్‌టుడే, మోస్ట్ ఇమ్మీడియెట్, ఇమ్మీడియెట్‌ కేటగిరీలుగా జీవోలను విభజించారు. అత్యవసరమైన నిర్ణయాల అమలును అవుట్ టుడేలో చేర్చారు. అంటే నిర్ణయం తీసుకున్న రోజే అందుకు […]

జీవోల జారీలో దూకుడుకు జగన్‌ కొత్త నిర్ణయం
X

జీవోల జారీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. ప్రాధాన్యత ఆధారంగా జీవోల జారీని మూడు కేటగిరీలుగా విభజించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలులో జాప్యం తగ్గించే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని ఫాలో కాబోతున్నారు. జీవోలను మూడు రకాలుగా విభజిస్తూ వాటి విడుదలకు కాలపరిమితిని ప్రకటించింది.

అవుట్‌టుడే, మోస్ట్ ఇమ్మీడియెట్, ఇమ్మీడియెట్‌ కేటగిరీలుగా జీవోలను విభజించారు. అత్యవసరమైన నిర్ణయాల అమలును అవుట్ టుడేలో చేర్చారు. అంటే నిర్ణయం తీసుకున్న రోజే అందుకు సంబంధించిన జీవో విడుదలవుతుంది.

మోస్ట్ ఇమ్మీడియెట్ కేటగిరిలో నిర్ణయం తీసుకుంటే 5 రోజుల్లోగా జీవో విడుదల చేస్తారు.

ఇమ్మీడియెట్‌ కేటగిరి నిర్ణయాలకు సంబంధించిన జీవోను 15 రోజుల్లోగా జారీ చేస్తారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకుని…. దాని అమలులో జాప్యం ప్రదర్శించకుండా ఉండేందుకు జీవోలను ఇలా విభజించారు.

First Published:  25 Oct 2019 7:57 AM IST
Next Story