Telugu Global
NEWS

శ్రీశైలానికి 6.5 లక్షల క్యూసెక్కుల భారీ వరద... బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరిక

గతంలో లేని విధంగా కృష్ణా నదికి వరద ఈ ఏడాది పదేపదే పోటెత్తుతోంది.ఈ సీజన్‌లో ఏడో సారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి హఠాత్తుగా వరద భారీగా పెరిగింది. గురువారం సాయంత్రానికి శ్రీశైలం వద్దకు ఏకంగా ఆరు లక్షల 65వేల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. భారీ వరద రావడంతో శ్రీశైలం 10 గేట్లను 24 అడుగుల మేర పైకి ఎత్తారు. దిగువకు 5.95 లక్షల క్యూసెక్కుల […]

శ్రీశైలానికి 6.5 లక్షల క్యూసెక్కుల భారీ వరద... బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరిక
X

గతంలో లేని విధంగా కృష్ణా నదికి వరద ఈ ఏడాది పదేపదే పోటెత్తుతోంది.ఈ సీజన్‌లో ఏడో సారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి హఠాత్తుగా వరద భారీగా పెరిగింది. గురువారం సాయంత్రానికి శ్రీశైలం వద్దకు ఏకంగా ఆరు లక్షల 65వేల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది.

భారీ వరద రావడంతో శ్రీశైలం 10 గేట్లను 24 అడుగుల మేర పైకి ఎత్తారు. దిగువకు 5.95 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి, హంద్రీనీవా ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఐదు లక్షల క్యూసెక్కులను దాటేసింది. ఆరు లక్షల క్యూసెక్కులకు ప్రవాహం చేరుకోవచ్చని భావిస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు 70 రోజులుగా భారీ వరద వస్తుండడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద లోపాలు బయటపడుతున్నాయి.

First Published:  25 Oct 2019 3:10 AM IST
Next Story