మోడీని తిట్టిన వీడియోలు డిలీట్ చేసిన పచ్చమీడియా
బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకొని బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు, ఆ పార్టీ అనుకూల మీడియా అంతా మోడీని విలన్ గా.. బీజేపీని మోసం చేసిన పార్టీగా ఎంత యాగీ చేయాలో అంతా చేశాయి. చివరకు చంద్రబాబు ఓడిపోవడం.. బీజేపీ గెలవడంతో ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యింది. అయితే చంద్రబాబుకు ఓడిపోయాక తత్వం బోధపడింది. ఇప్పుడు బీజేపీతో దోస్తీకి ఆయన అర్రులు చాస్తున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలు ఆంధ్ర జ్యోతి, టీవీ […]
బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకొని బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు, ఆ పార్టీ అనుకూల మీడియా అంతా మోడీని విలన్ గా.. బీజేపీని మోసం చేసిన పార్టీగా ఎంత యాగీ చేయాలో అంతా చేశాయి. చివరకు చంద్రబాబు ఓడిపోవడం.. బీజేపీ గెలవడంతో ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యింది.
అయితే చంద్రబాబుకు ఓడిపోయాక తత్వం బోధపడింది. ఇప్పుడు బీజేపీతో దోస్తీకి ఆయన అర్రులు చాస్తున్నారు.
తాజాగా తెలుగు దేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలు ఆంధ్ర జ్యోతి, టీవీ 5 భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకున్నాయనేది బహిరంగ రహస్యం. అయితే అంతకుముందు ఇదే ఏబీఎన్, టీవీ5లు బీజేపీపై చంద్రబాబు ప్రోద్బలంతో ఎంత దుమ్మెత్తిపోశాయన్నది తెలిసిందే.
అయితే ఎన్నికల్లో ఓడిపోయాక టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మరోసారి యు-టర్న్ తీసుకున్నారు. బీజేపీతో ఘర్షణకు దిగడంలో తాను తప్పు చేశానని, తనకు మోడీతో వ్యక్తిగత శత్రుత్వం లేదని పేర్కొన్నాడు. సుజనా చౌదరి వంటి తన మాజీ సహచరుల ద్వారా రాజీ కోసం బీజేపీ నాయకత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది.
సహజంగానే, టిడిపి అనుకూల రెండు ఛానెల్స్ కూడా బీజేపీ విషయంలో తమ స్టాండ్ పూర్తిగా మార్చేశాయి. రాధాకృష్ణ కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటి కావడం.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా యు-టర్న్ తీసుకొని బిజెపితో సహజీవనం చేయడం ప్రారంభించాడు.
అయితే, బీజేపీ గతాన్ని గుర్తుచేసుకుని, మోడీకి, బిజెపికి వ్యతిరేకంగా ఈ టీడీపీ ఛానెల్స్ ప్రసారం చేసిన కార్యక్రమాలను ప్రశ్నించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.
ఇక నెటిజన్లు ఈ పచ్చమీడియా మోడీపై చేసిన కథనాలు సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే తాజాగా ఆ రెండు ఛానెల్స్ బిజెపి వ్యతిరేక , మోడీ వ్యతిరేక చర్చలు , కార్యక్రమాల వీడియో క్లిప్పింగులను వారి గ్రంథాలయాలతో పాటు యూట్యూబ్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తొలగించినట్లు తెలిసింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి మరియు టివి 5 ఇటీవల యూట్యూబ్ నుంచి మోడీ వ్యతిరేక మరియు బిజెపి వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన 3 వేలకు పైగా వీడియోలను తొలగించాయని సమాచారం.
అయితే, ఈ పచ్చమీడియా ఎంతలా అభాసుపాలు చేసిందో బీజేపీ నాయకులకు తెలియందీ కాదు.. బీజేపీ సాంకేతిక బృందం ఇప్పటికే ఇటువంటి ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్ చేసి, అలాంటి అన్ని వీడియోలను భద్రపరిచినట్లు తెలిసింది. కాబట్టి, యూట్యూబ్‌లో వీడియోలు కనిపించనప్పటికీ, వాటిని బిజెపి మరిచిపోయి స్నేహంగా ఉంటుందనుకుంటే పొరపాటేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.