ఈ మాజీ సీఎం చేసిన తప్పు.... కాంగ్రెస్‌ను వెంటాడుతోందా?
మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసిందెవరు? గత ఎన్నికల కంటే కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి మంచి ఫలితాలు సాధించింది. కూటమి సీట్లు సెంచరీ దాటింది. కానీ అధికారానికి 40 సీట్ల దూరంలో నిలిచిపోయింది. బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లు సాధించింది. మేజిక్ మార్క్ 144 దాటేసింది. రెండోసారి ప్రభుత్వ ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసిందెవరు? అంటే ఒకరు ఇండిపెండెంట్లు. స్వతంత్య్ర అభ్యర్థులు 13 మంది గెలిచారు. ఇందులో కాంగ్రెస్,బీజేపీ,ఎన్సీపీ రెబెల్స్ ఉన్నారు. వీరు […]
మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసిందెవరు? గత ఎన్నికల కంటే కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి మంచి ఫలితాలు సాధించింది. కూటమి సీట్లు సెంచరీ దాటింది. కానీ అధికారానికి 40 సీట్ల దూరంలో నిలిచిపోయింది. బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లు సాధించింది. మేజిక్ మార్క్ 144 దాటేసింది. రెండోసారి ప్రభుత్వ ఏర్పాటు చేస్తోంది.
కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసిందెవరు? అంటే ఒకరు ఇండిపెండెంట్లు. స్వతంత్య్ర అభ్యర్థులు 13 మంది గెలిచారు. ఇందులో కాంగ్రెస్,బీజేపీ,ఎన్సీపీ రెబెల్స్ ఉన్నారు. వీరు ఎక్కువగా కాంగ్రెస్, ఎన్సీపీ విజయావకాశాలను దెబ్బతీశారు. బీజేపీ,శివసేన గెలిచిన చోట కూడా ఇండిపెండెంట్ల వల్లనే కాంగ్రెస్,ఎన్సీపీ కూటమి నష్ట పోయింది.
ఇక రెండోది ఎంఐఎం. ఎంఐఎం పోటీ వల్ల ఔరంగాబాద్, బీడ్, అహ్మద్‌నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ తీవ్రంగా నష్టపోయాయి. ఎంఐఎం రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. అవి ఒకటి దూలే సిటీ. రెండు మాలేగావ్. కానీ 30 నుంచి 44 సీట్లలో కాంగ్రెస్, ఎన్సీపీని దెబ్బతీసింది. ఎంఐఎం కాంగ్రెస్ వైపు నిలిచి ఉంటే ఈ సీట్లు ఈజీగా గెలిచేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది.
2014 నుంచి కాంగ్రెస్ వైపు ఎంఐఎం నిలబడడం లేదు. అజాద్ లాంటి సీనియర్ నేతలు దువ్వినా అటు వైపు రావడం లేదు. కారణం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఒక తప్పిదం. తాను ముఖ్యమంత్రిగా ఉండగా అసదుద్దీన్,అక్బరుద్దీన్‌ను జైలుకు పంపారు. దీంతో కాంగ్రెస్‌పై కక్ష గట్టిన అసద్ దేశవ్యాప్తంగా ఆ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
పాతబస్తీకి పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు పాట్నా వైపు కూడా చూస్తోంది. బీహార్‌లోని కిషన్‌గంజ్ ఉప ఎన్నికల్లో గెలిచింది. అంతే కాకుండా యూపీ ఎన్నికల్లో కూడా ఓట్ల చీలికకు ఉపయోగపడింది. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు కోత పెట్టే అవకాశం ఉంది. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు పడేవి. కానీ ఇప్పుడు ఎంఐఎం పోటీ వల్ల చీలిక వస్తోంది. బీజేపీకి ఉపయోగపడుతోంది.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అనాలోచిత విధానం వల్ల చేసిన ఒక తప్పుకు…. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.