Telugu Global
NEWS

ఫేక్‌ ఐడీలతో ఇసుక బుకింగ్‌పై ప్రభుత్వం కొరడా

నదుల్లో భారీ వరదల కారణంగా ఇసుక రీచ్‌లు మునిగిపోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. దాంతో వాగులు, వంకల్లోని ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రోజుకు 45 వేల టన్నుల ఇసుకను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ఈ ఇసుకను కూడా ఆన్‌లైన్‌లో కొందరు నకిలీ ఐడీలతో కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని అధిక ధరకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. గుంటూరుకు చెందిన కిషోర్ అనే వ్యక్తి ఫేక్ ఐడీల ద్వారా ఆన్‌లైన్లో […]

ఫేక్‌ ఐడీలతో ఇసుక బుకింగ్‌పై ప్రభుత్వం కొరడా
X

నదుల్లో భారీ వరదల కారణంగా ఇసుక రీచ్‌లు మునిగిపోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. దాంతో వాగులు, వంకల్లోని ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రోజుకు 45 వేల టన్నుల ఇసుకను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ఈ ఇసుకను కూడా ఆన్‌లైన్‌లో కొందరు నకిలీ ఐడీలతో కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని అధిక ధరకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. గుంటూరుకు చెందిన కిషోర్ అనే వ్యక్తి ఫేక్ ఐడీల ద్వారా ఆన్‌లైన్లో లక్షా 27 వేల విలువైన ఇసుకను కొనుగోలు చేశారు. ఇతడు పదేపదే ఇలా చేస్తున్నట్టు గుర్తించారు. దాంతో అధికారుల ఫిర్యాదు మేరకు కిషోర్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అతడి నుంచి 27 టన్నుల ఇసుక, ఏడు ట్రాక్టర్లను సీజ్ చేశారు.

కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దుర్గారావ్‌ కూడా ఇదే పనిచేశారు. మీ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న దుర్గారావ్… ఇసుక కొరతను క్యాష్‌ చేసుకునేందుకు ఫేక్ ఐడీల ద్వారా భారీగా ఇసుకను బుక్ చేశాడు. 3లక్షల 80వేల రూపాయల విలువైన ఇసుకను బుక్‌ చేశాడు. దీన్ని గుర్తించిన పోలీసులు దుర్గారావ్‌పై కేసులు నమోదు చేశారు.

కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరి నదిలో 40 రోజులుగా వరద కొనసాగుతుండడంతో ఇసుక లభ్యత పడిపోయింది. ప్రభుత్వం 200 ఇసుక రీచ్‌లను గుర్తించగా… వరద కారణంగా 60 రీచ్‌ల్లో మాత్రమే ఇసుక తీసుకోవడానికి సాధ్యమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తుంగభద్ర, పెన్నా, వంశధార నదుల్లోనూ ప్రవాహం కొనసాగుతోంది. నదుల్లో ప్రవాహం తగ్గే వరకు ఇసుక ఇబ్బందులు తప్పేలా లేవు.

First Published:  25 Oct 2019 3:12 AM IST
Next Story