సోషల్ మీడియాలో అగ్రవర్ణాలదే పైచేయి...
సోషల్ మీడియాలో ఏఏ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయన్న దానిపై ఢిల్లీకి చెందిన లోక్‌నీతి అండ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్( సీఎస్‌డీఎస్) అనే సంస్థ జర్మన్‌కు చెందిన మరో సంస్థతో కలిసి సర్వే నిర్వహించింది. సోషల్ మీడియా అండ్ పొలిటికల్ బిహేవియర్ పేరుతో రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం దేశంలో అగ్రవర్ణాల వారే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. 15 శాతం మంది అగ్రవర్ణాల వారు సోషల్ మీడియాలో చాలా […]
సోషల్ మీడియాలో ఏఏ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయన్న దానిపై ఢిల్లీకి చెందిన లోక్‌నీతి అండ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్( సీఎస్‌డీఎస్) అనే సంస్థ జర్మన్‌కు చెందిన మరో సంస్థతో కలిసి సర్వే నిర్వహించింది. సోషల్ మీడియా అండ్ పొలిటికల్ బిహేవియర్ పేరుతో రిపోర్టును విడుదల చేసింది.
ఈ రిపోర్టు ప్రకారం దేశంలో అగ్రవర్ణాల వారే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. 15 శాతం మంది అగ్రవర్ణాల వారు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా దళితుల్లో 8శాతం, గిరిజనుల్లో ఏడు శాతం మంది ఉన్నారు.
బీసీల్లో 9 శాతం మంది సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉంటున్నారు. సోషల్ మీడియాను దేశంలో బలంగా వాడుకుంటున్న పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించిన బీజేపీ అందుకు ప్రత్యేకంగా బృందాలను నియమించుకుని దూసుకెళ్తోంది. బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగడానికి సోషల్ మీడియానే ప్రధానకారణం.
సోషల్ మీడియాను విస్మరించి రాజకీయాలు సాగించడం ఏ పార్టీకి కూడా సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు.