విరాట్ కొహ్లీతో నేడు దాదా సమావేశం
ధోనీకి బీసీసీఐ చైర్మన్ గంగూలీ భరోసా భారత క్రికెట్ బోర్డు 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే…భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన లక్ష్యాలను, ప్రాధమ్యాలను మీడియా ముందుంచాడు. సౌరవ్ గంగూలీ చైర్మన్ కావడంతోనే 33 మాసాల పాలకమండలి పాలనకు తెరపడింది. కష్టసమయంలో భారతజట్టును కెప్టెన్ గా ముందుండి ఏవిధంగా విజయపథంలో నడిపానో…భారత క్రికెట్ బోర్డుకు సైతం అదే తరహా నాయకత్వం అందిస్తానని సౌరవ్ గంగూలీ ముంబైలో ప్రకటించాడు. భారత కెప్టెన్ గా గతంలో తాను ధరించిన బీసీసీఐ […]
- ధోనీకి బీసీసీఐ చైర్మన్ గంగూలీ భరోసా
భారత క్రికెట్ బోర్డు 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే…భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన లక్ష్యాలను, ప్రాధమ్యాలను మీడియా ముందుంచాడు. సౌరవ్ గంగూలీ చైర్మన్ కావడంతోనే 33 మాసాల పాలకమండలి పాలనకు తెరపడింది.
కష్టసమయంలో భారతజట్టును కెప్టెన్ గా ముందుండి ఏవిధంగా విజయపథంలో నడిపానో…భారత క్రికెట్ బోర్డుకు సైతం అదే తరహా నాయకత్వం అందిస్తానని సౌరవ్ గంగూలీ ముంబైలో ప్రకటించాడు. భారత కెప్టెన్ గా గతంలో తాను ధరించిన బీసీసీఐ బ్లేజర్ ను సౌరవ్ గంగూలీ ధరించి వచ్చి…అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.
భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోడం తనకు లభించిన గొప్ప వరమని, గౌరవాన్ని కాపాడుతానని…ఏ విషయంలోనూ రాజీపడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పాడు.
దాదాకు బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, కార్యదర్శి నిరంజన్ షా, రాజీవ్ శుక్లా అభినందలు తెలపడంతో పాటు తమ సహకారాన్ని అందిస్తూ అండగా నిలిచారు.
అవినీతికి ఆమడదూరంలో…
భారత క్రికెట్ బోర్డును అవినీతిరహితంగా ఉండేలా చూస్తానని, పారదర్శకతకు పెద్దపీట వేస్తానని దాదా చెప్పాడు. భారత క్రికెట్లో అత్యంత కీలక వ్యక్తి విరాట్ కొహ్లీతో.. తాను గురువారం సమావేశమవుతానని…కొహ్లీ అభిప్రాయాలు తెలుసుకొని…అతనికి అండగా నిలవాలన్నదే తన ఉద్దేశమని వివరించాడు.
భారత క్రికెట్ ఉన్నతి కోసం పాటుపడుతున్న ప్రతిఒక్కరికీ తగిన విలువ, గౌరవం ఉంటాయని దాదా హామీ ఇచ్చాడు.
ధోనీకి దాదా భరోసా…
భారత క్రికెట్ చాంపియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కెరియర్ కు వచ్చిన ముప్పు ఏమీలేదని…తాను ఉన్నంతవరకూ ధోనీ గౌరవమర్యాదలకు లోటు ఉండబోదని స్పష్టం చేశాడు.
47 సంవత్సరాల సౌరవ్ గంగూలీ కేవలం 9 మాసాలపాటు మాత్రమే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ నిబంధనల ప్రకారం…ఇప్పటి వరకూ బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా, అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన సౌరవ్ గంగూలీ..కేవలం 9 మాసాలపాటు మాత్రమే బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వరించే అవకాశం ఉంది.
బోర్డు తాజా నిబంధనల ప్రకారం వరుసగా మూడు టర్మ్ లపాటు క్రికెట్ సంఘాల బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తులు కొంతకాలం పదవికి దూరంగా ఉండేలా నిబంధనలు ప్రవేశపెట్టారు.