మహారాష్ట్రలో రసవత్తరం... శివసేనే బీజేపీకి ఆధారం
మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి మేజిక్ ఫిగర్ దాటేసింది. 288 స్థానాలున్న అసెంబ్లీలో 145 మేజిక్ ఫిగర్. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేనపై బీజేపీ పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. శివసేన పెట్టే డిమాండ్లకు ఈసారి బీజేపీ తలవంచక తప్పదు. మేజిక్ ఫిగర్ 144 కాగా… బీజేపీ 95 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. శివసేన 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 40 స్థానాలకు పరిమితమవుతోంది. కాంగ్రెస్ కంటే ఎన్‌సీపీ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. […]
మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి మేజిక్ ఫిగర్ దాటేసింది. 288 స్థానాలున్న అసెంబ్లీలో 145 మేజిక్ ఫిగర్. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేనపై బీజేపీ పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. శివసేన పెట్టే డిమాండ్లకు ఈసారి బీజేపీ తలవంచక తప్పదు.
మేజిక్ ఫిగర్ 144 కాగా… బీజేపీ 95 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. శివసేన 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 40 స్థానాలకు పరిమితమవుతోంది. కాంగ్రెస్ కంటే ఎన్‌సీపీ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఎన్‌సీపీ 53 స్థానాల్లో సత్తా చాటుతోంది.
కూటమికి శివసేన కట్టుబడితే బీజేపీ- శివసేన కూటమి అధికార పీఠం అధిరోహిస్తుంది. శివసేన సీఎం పదవిని చేపట్టే రోజు వస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈసారి హంగ్‌ను అడ్డుపెట్టుకుని శివసేన భారీ డిమాండ్లు పెడుతుందా అన్నది చర్చనీయాంశమవుతోంది.
శివసేనను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి దాదాపు అసాధ్యం. అదే సమయంలో ఎన్‌సీపీలోని ఒక వర్గం తమకు మద్దతు ఇస్తుందంటూ బీజేపీ లీకులు మొదలుపెట్టింది.
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎంఐఎం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఎంఐఎం చాలా నియోజకవర్గాల్లో భారీగా ముస్లిం ఓట్లను చీల్చింది. దాంతో అక్కడ కాంగ్రెస్ దెబ్బతింది. బీజేపీ భారీ సీట్లు సాధించడానికి ఎంఐఎం కూడా పరోక్షంగా దోహదపడింది.
అందుకోని ఎగ్జిట్ పోల్స్…
మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమికి ఫలితం ఏకపక్షంగా ఉంటుందని అనేక సర్వేలు చెప్పాయి. దాదాపు అన్ని సర్వేలు బీజేపీ కూటమికి 200 స్థానాలకు పైగా వస్తాయని చెప్పాయి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత ట్రెండ్ బట్టి బీజేపీ కూటమి 160 స్థానాలకు అటుఇటుగా ఆగే సూచనలు కనిపిస్తున్నాయి.