షైన్ ఆసుపత్రికి అసలు అనుమతులే లేవు..!
ఎల్బీనగర్‌లోని షైన్ చిన్న పిల్లల ఆసుపత్రిలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు దగ్గరలోనే ఉన్న ఈ ఆసుపత్రికి అసలు అనుమతులే లేవని తెలుస్తోంది. అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి మరణించిన తర్వాత మేల్కొన్న ప్రభుత్వం.. వెంటనే ఒక త్రిసభ్య కమిటీని నియమించి దర్యాప్తునకు ఆదేశించింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించగా.. అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ ఆసుపత్రికి అసలు అనుమతులే తీసుకోలేదని.. నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రిని […]
ఎల్బీనగర్‌లోని షైన్ చిన్న పిల్లల ఆసుపత్రిలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు దగ్గరలోనే ఉన్న ఈ ఆసుపత్రికి అసలు అనుమతులే లేవని తెలుస్తోంది. అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి మరణించిన తర్వాత మేల్కొన్న ప్రభుత్వం.. వెంటనే ఒక త్రిసభ్య కమిటీని నియమించి దర్యాప్తునకు ఆదేశించింది.
ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించగా.. అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ ఆసుపత్రికి అసలు అనుమతులే తీసుకోలేదని.. నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారని తేల్చారు. ఇన్నేండ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నా.. అసలు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఎందుకు వెలుగులోనికి రాలేదనే విషయం కూడా ఆరాతీస్తున్నారు.
ఆరోగ్య శాఖలోని సిబ్బంది ఎవరైనా ఈ విషయం తొక్కి పెట్టారా? అనే దానిపై విచారణ చేయబోతున్నారు. ఇక, త్రిసభ్య కమిటీ తనిఖీల అనంతరం రూపొందించిన నివేదికను ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతకుమారీకి అందజేయనున్నారు. ఆ నివేదికను అధ్యయనం చేసిన అనంతరం ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారు.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో గురువారం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.