బంగ్లాదేశ్ తో టీ-20 సిరీస్ కు భారతజట్టు ఎంపిక నేడే
కొహ్లీ దూరం…రోహిత్ శర్మ చేతికి టీ-20 జట్టు పగ్గాలు వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా బంగ్లాదేశ్ తో వచ్చేనెలలో ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు కెప్టెన్ విరాట్ కొహ్లీ దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాడు. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూ వస్తున్న వర్క్ లోడ్ వ్యూహంలో భాగంగా…కొహ్లీకి రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. కొహ్లీకి బదులుగా రోహిత్ శర్మ భారతజట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 2019 జనవరిలో న్యూజిలాండ్ తో జరిగిన […]
- కొహ్లీ దూరం…రోహిత్ శర్మ చేతికి టీ-20 జట్టు పగ్గాలు
వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా బంగ్లాదేశ్ తో వచ్చేనెలలో ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు కెప్టెన్ విరాట్ కొహ్లీ దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాడు.
కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూ వస్తున్న వర్క్ లోడ్ వ్యూహంలో భాగంగా…కొహ్లీకి రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. కొహ్లీకి బదులుగా రోహిత్ శర్మ భారతజట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
2019 జనవరిలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోని ఆఖరి రెండు వన్డేల నుంచి విశ్రాంతి తీసుకొన్న విరాట్ కొహ్లీ…ఆ తర్వాత నుంచి నాన్ స్టాప్ గా సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ వస్తున్నాడు.
అయితే…బంగ్లాదేశ్ తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు మాత్రం విరాట్ కొహ్లీ అందుబాటులో ఉంటాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
నేడే భారతజట్టు ఎంపిక…
బంగ్లాదేశ్ తో జరిగే మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టు ఎంపిక కోసం…ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ముంబైలో ఈరోజు సమావేశం కానుంది.
మహేంద్రసింగ్ ధోనీ తనకుతానుగా విశ్రాంతి తీసుకోడంతో…వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా రిషబ్ పంత్ నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ నుంచి..రిషభ్ పంత్ కు గట్టి పోటీ ఎదురుకానుంది.