Telugu Global
NEWS

భారీ మెజారిటీ దిశగా టీఆర్‌ఎస్ అభ్యర్థి

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ హవా సాగుతోంది. భారీ మెజారిటీ దిశగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి అడుగులేస్తున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి 9వేల 356 ఓట్ల మెజారిటీతో సైదిరెడ్డి దూసుకెళ్తున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో ఉండగా… టీడీపీ అభ్యర్థి కిరణ్మయి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. ట్రెండ్ చూస్తుంటే హుజుర్‌నగర్‌ స్థానాన్ని కాంగ్రెస్ భారీ ఓట్ల తేడాతో కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి […]

భారీ మెజారిటీ దిశగా టీఆర్‌ఎస్ అభ్యర్థి
X

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ హవా సాగుతోంది. భారీ మెజారిటీ దిశగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి అడుగులేస్తున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి 9వేల 356 ఓట్ల మెజారిటీతో సైదిరెడ్డి దూసుకెళ్తున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉన్నారు.

బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో ఉండగా… టీడీపీ అభ్యర్థి కిరణ్మయి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. ట్రెండ్ చూస్తుంటే హుజుర్‌నగర్‌ స్థానాన్ని కాంగ్రెస్ భారీ ఓట్ల తేడాతో కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా గెలిచారు. దాంతో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ భార్య పద్మావతి బరిలో దిగారు.

రౌండ్ రౌండ్‌కు మెజారిటీ అమాంతం పెరుగుతుండడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి.

First Published:  24 Oct 2019 3:56 AM IST
Next Story