Telugu Global
National

హంగ్‌ దిశగా హర్యానా... ప్లాన్‌ బీకి అమిత్ షా, కాంగ్రెస్...

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ బీజేపీకి ఏకపక్షంగా ఫలితం ఉంటుందని అంచనా వేశారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 90 స్థానాల అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్ 46. అయితే దాన్ని అందుకునేందుకు బీజేపీ చాలా శ్రమిస్తోంది. ఎక్కువ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ మేజిక్ ఫిగర్ అందుకోవడం కష్టమనిపిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ 40 స్థానాల్లో, కాంగ్రెస్ 30 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ అనూహ్యంగా జేజేపీ మంచి ప్రదర్శన కనబరిచింది. […]

హంగ్‌ దిశగా హర్యానా... ప్లాన్‌ బీకి అమిత్ షా, కాంగ్రెస్...
X

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ బీజేపీకి ఏకపక్షంగా ఫలితం ఉంటుందని అంచనా వేశారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 90 స్థానాల అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్ 46. అయితే దాన్ని అందుకునేందుకు బీజేపీ చాలా శ్రమిస్తోంది. ఎక్కువ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ మేజిక్ ఫిగర్ అందుకోవడం కష్టమనిపిస్తోంది.

ఇప్పటి వరకు బీజేపీ 40 స్థానాల్లో, కాంగ్రెస్ 30 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ అనూహ్యంగా జేజేపీ మంచి ప్రదర్శన కనబరిచింది. 11 స్థానాల్లో అధిక్యం కొనసాగిస్తోంది. దాంతో హంగ్ సూచనలు కనిపిస్తున్నాయి.

మేజిక్‌ ఫిగర్‌ అందుకోలేని పక్షంలో ప్లాన్‌ బీ అమలు చేసేందుకు అమిత్ షా సిద్దమయ్యారు. జేజేపీతో చర్చలకు అప్పుడే పార్టీ నేతలను రంగంలోకి దింపారు. ఆరు చోట్ల ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు. దాంతో వారిని దువ్వేందుకు కమలనాథులు రంగంలోకి దిగారు.

అటు కాంగ్రెస్‌ కూడా బీజేపీ ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. జేజేపీకి సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. గంట ఆగి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుందని కాంగ్రెస్ నేత హుడా చేసిన వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి. ఓంప్రకాశ్‌ చౌతాలా మనవడు దుశ్వంత్ చౌతాలా జననాయక్ జనతా పార్టీని స్థాపించారు. మొదటి ఎన్నికల్లోనే సత్తా చాటి కింగ్ మేకర్‌గా ఆవిర్భవిస్తోంది ఈ పార్టీ.

హర్యానా అసెంబ్లీ తాళాలు తన చేతుల్లో ఉన్నాయని దుశ్వంత్ చౌతాలా వ్యాఖ్యానించారు. కొత్త చరిత్ర రాయబోతున్నామని వ్యాఖ్యానించారు. పార్టీ మొదటి ఎన్నికల్లో సత్తా చాటేలా కృషి చేసిన కార్యకర్తలకు దుశ్వంత్ కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  24 Oct 2019 5:18 AM IST
Next Story