Telugu Global
NEWS

ధర్మాడి సత్యాన్ని సత్కరించిన కలెక్టర్

గోదావరిలో 37 రోజుల క్రితం మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఒడ్డుకు తీసుకొని వచ్చిన ధర్మాడి సత్యాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సన్మానించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా చేతులెత్తేసిన తర్వాత రంగంలోనికి దిగిన బాలాజీ మెరైన్ కంపెనీకి చెందిన సత్యం బృందం అనేక అడ్డంకులను ఎదుర్కొని బోటును బయటకు తీసింది. కాగా, సత్యంను సత్కరించి 20 లక్షల రూపాయల చెక్కును అందించారు. బోటు వెలికితీతకు ఇంతకు మునుపే బాలాజీ కంపెనీతో ప్రభుత్వం 22.70 […]

ధర్మాడి సత్యాన్ని సత్కరించిన కలెక్టర్
X

గోదావరిలో 37 రోజుల క్రితం మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఒడ్డుకు తీసుకొని వచ్చిన ధర్మాడి సత్యాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సన్మానించారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా చేతులెత్తేసిన తర్వాత రంగంలోనికి దిగిన బాలాజీ మెరైన్ కంపెనీకి చెందిన సత్యం బృందం అనేక అడ్డంకులను ఎదుర్కొని బోటును బయటకు తీసింది.

కాగా, సత్యంను సత్కరించి 20 లక్షల రూపాయల చెక్కును అందించారు. బోటు వెలికితీతకు ఇంతకు మునుపే బాలాజీ కంపెనీతో ప్రభుత్వం 22.70 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందస్తుగా 2.70 లక్షలు చెల్లించింది. మిగిలిన డబ్బును ఇవాళ కలెక్టర్ చెక్కు రూపంలో అందించారు.

ఇక ధర్మాడి సత్యం బృందంలో మొత్తం 25 మంది ఈ వెలికితీత కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా బాలాజీ మెరైన్ కంపనీకి ఈ పనులు చేయడంలో అనుభవం ఉంది.

First Published:  24 Oct 2019 12:43 AM IST
Next Story