Telugu Global
NEWS

బండ్ల గణేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టాలీవుడ్ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. టెంపర్ సినిమాకు ఫైనాన్స్ చేసిన నిర్మాత, వైసీపీ నేత పీవీపీ (పొట్లూరు వరప్రసాద్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత కొన్ని రోజులుగా గణేష్ కోసం గాలించారు. తన వద్ద డబ్బులు తీసుకొని అసలు చెల్లించినా, వడ్డీ చెల్లించకుండా తప్పించుకొని తిరగడమే కాకుండా, తనను బెదిరించాడని పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే చెక్ బౌన్స్ కావడంతోనే పీవీపీ ఫిర్యాదు చేశారని… ఆ మేరకే […]

బండ్ల గణేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
X

టాలీవుడ్ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

టెంపర్ సినిమాకు ఫైనాన్స్ చేసిన నిర్మాత, వైసీపీ నేత పీవీపీ (పొట్లూరు వరప్రసాద్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత కొన్ని రోజులుగా గణేష్ కోసం గాలించారు. తన వద్ద డబ్బులు తీసుకొని అసలు చెల్లించినా, వడ్డీ చెల్లించకుండా తప్పించుకొని తిరగడమే కాకుండా, తనను బెదిరించాడని పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే చెక్ బౌన్స్ కావడంతోనే పీవీపీ ఫిర్యాదు చేశారని… ఆ మేరకే పోలీసులు గణేష్‌ను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ టెంపర్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు పీవీపీ 30 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అసలుతో పాటు 7 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారని చెబుతున్నారు. కాగా, అసలు చెల్లించిన గణేష్ మిగిలిన 7 కోట్ల రూపాయలు చెల్లించడంలో జాప్యం చేశాడట. చివరికి చెల్లని చెక్కుని ఇచ్చాడు. అది చెక్ బౌన్స్ అయింది.

వీరిద్దరి మధ్య గత కొన్ని నెలలుగా ఈ వివాదం నడుస్తోంది. ఈ విషయంపై గణేష్, పీవీపీ మధ్య తీవ్ర వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గణేష్ తన అనుచరులతో కలసి ఒక అర్థరాత్రి ఇంటికి వచ్చి బెదిరించారని పోలీసులకు పీవీపీ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా చెక్ బౌన్స్ పై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గణేష్‌పై సెక్షన్ 420, 448, 506, 506 ఆర్/డబ్ల్యూ 43 కింద కేసు నమోదు చేశారు.

దీంతో గణేష్‌ను చెక్ బౌన్స్ కేసుతో పాటు ఇతర సెక్షన్ ల కింద అదుపులోనికి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు.

First Published:  24 Oct 2019 12:36 AM IST
Next Story