Telugu Global
NEWS

చదువేంటి? చేసిన పరిశోధనలు ఏంటి?- వీసీ దామోదర్ నాయుడికి నోటీసులు

ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో ఇటీవల అరెస్ట్ అయి ఆ తర్వాత విడుదలైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీ వీసీ వల్లభనేని దామోదర్‌నాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీసీ అయ్యేందుకు దామోదర్‌నాయుడికి ఎలాంటి అర్హతలు లేవంటూ గాలి సుదర్శన నాయుడు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి ధర్మాసనం వీసీకి నోటీసులు జారీ చేసింది. విద్యార్హతలు ఏమిటి?, ఏఏ అంశాలపై ఇప్పటి వరకు పరిశోధన చేశారు?… ఎలాంటి […]

చదువేంటి? చేసిన పరిశోధనలు ఏంటి?- వీసీ దామోదర్ నాయుడికి నోటీసులు
X

ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో ఇటీవల అరెస్ట్ అయి ఆ తర్వాత విడుదలైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీ వీసీ వల్లభనేని దామోదర్‌నాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వీసీ అయ్యేందుకు దామోదర్‌నాయుడికి ఎలాంటి అర్హతలు లేవంటూ గాలి సుదర్శన నాయుడు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి ధర్మాసనం వీసీకి నోటీసులు జారీ చేసింది.

విద్యార్హతలు ఏమిటి?, ఏఏ అంశాలపై ఇప్పటి వరకు పరిశోధన చేశారు?… ఎలాంటి అర్హతలతో వీసీ అయ్యారో వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తొలి నుంచి వివాదస్పద వ్యక్తిగా ఉన్న దామోదర్‌నాయుడిపై ఇటీవల అట్రాసిటీ కేసు నమోదు అయింది. దాంతో అరెస్ట్ చేశారు. దామోదర్‌నాయుడు అరెస్ట్‌కు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. కేశినేని నాని బృందం గవర్నర్‌ను కలిసి దామోదర్‌నాయుడును అరెస్ట్ చేయడంపై ఫిర్యాదు చేసింది.

మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విమర్శించింది. దామోదర్‌నాయుడు… చంద్రబాబు సొంతసామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో తెలుగుదేశం పార్టీ వెనుకేసుకొస్తోందని వైసీపీ నేత మేరుగ నాగార్జున లాంటి వారు విమర్శించారు.

First Published:  24 Oct 2019 2:15 AM IST
Next Story